టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య గొడ‌వ‌లుంటే…!

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి మ‌ధ్య విభేదాలుండ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌ల‌రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి మ‌ధ్య విభేదాలుండ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. వీళ్ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం వ‌ల్లే దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే త‌మ మ‌ధ్య గొడ‌వ‌లేవీ లేవ‌ని ఆ ముగ్గురు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో టీటీడీలో గొడ‌వ‌ల‌పై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కీల‌క కామెంట్స్ చేశారు. టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య గొడ‌వ‌లుంటే బ‌య‌ట చూసుకోవాల‌ని హిత‌వు చెప్పారు. భ‌క్తుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. తిరుప‌తిలో తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న‌కు బాధ్యులైన వాళ్ల‌పై కేసు పెట్టి, చట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

దుర్ఘ‌ట‌న జ‌రిగి వార‌మ‌వుతున్నా, కేవ‌లం మొక్కుబ‌డిగా బ‌దిలీలు చేసి చేతులు దులుపుకున్నార‌ని విమ‌ర్శించారు. ఇలాగైతే తాము న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించి తొక్కిస‌లాట‌కు బాధ్యులైన వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా చేస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి హెచ్చ‌రించారు.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగిందంటూ నానాహంగామా చేసిన సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు ఎందుక‌ని మౌనంగా ఉన్నార‌ని ఆయ‌న నిల‌దీశారు.

5 Replies to “టీటీడీ చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య గొడ‌వ‌లుంటే…!”

  1. ఈసారి కూడా మా A1అదిదంపతులు తాడేపల్లి

    “ప్యాలెస్ లో తిరుమల సెట్టింగ్” వేసుంటే ఆ జోష్ వేరే లెవెల్ ఉండేది కదా??

    ..ఉప్చ్ మిస్ అయ్యాం.. చాలా భాదగా ఉంది రా గ్యాస్ ఎంకి.

    A1దంపతులు

    “పందికొవ్వు కలిపిన

  2. ఈసారి అవన్నీ miss..

    last year మా A1 అదిదంపతులు “తాడేపల్లి ప్యాలెస్ లో “తిరుమల సెట్టింగ్” వేసి చక్కగా “పందికొవ్వుకలిపిన ప్రసాదం” తింటూ సంక్రాంతి విశిష్టత గురించి రాష్ట్ర ప్రజలకి demonstrate చేసారు..

    ఈసారి అవన్నీ miss అవుతున్నాం..రా సుబ్బి

  3. Be naidu wants to sell all arjitha seva, ttd rooms, vip darshan tickets at his TV5 office.. papam EO addupaddadu…anduke…

    emi GA, would you resolve naidu problems??

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.