నిర్మాత డెస్టినేషన్ బర్త్ డే!

జుట్టు వుంటే ఎన్ని రకాల హెయిర్ స్టయిల్స్ అన్నా ట్రయ్ చేయవచ్చు. డబ్బులు వుంటే ఏ రకంగానైనా ఎంజాయ్ చేయచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్ మాదిరిగానే డెస్టినేషన్ బర్త్ డే పార్టీ ఇవ్వొచ్చు.  Advertisement ప్రముఖ…

జుట్టు వుంటే ఎన్ని రకాల హెయిర్ స్టయిల్స్ అన్నా ట్రయ్ చేయవచ్చు. డబ్బులు వుంటే ఏ రకంగానైనా ఎంజాయ్ చేయచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్ మాదిరిగానే డెస్టినేషన్ బర్త్ డే పార్టీ ఇవ్వొచ్చు. 

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధినేత నవీన్ తన 50 వ బర్త్ డే పార్టీని భారీగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. స్నేహితులు, బంధువులు, సహచరులు ఇలా కొంత మందిని తీసుకుని దుబాయ్ వెళ్లబోతున్నారు.

ఈనెల 21న నవీన్ బర్త్ డే. దుబాయ్ సముద్రంలో ఓ విలాసవంతమైన నౌకను పార్టీ కోసం బుక్ చేసారు. ఆ నౌకలో, సముద్రం మధ్యలో ఈ పార్టీ అన్న మాట. అది కదా మజా… మస్తీ అంటే. 

నవీన్ టాలీవుడ్ లో ఓ సంచలనం. ఒకేసారి భారీ సినిమాలతో సర్రున దూసుకువచ్చారు టాలీవుడ్ లోకి. ఒకేసారి టాప్ యాక్టర్లు, డైరక్టర్లు అందరికీ అడ్వాన్స్ లు ఇచ్చారు. చకచకా సినిమాలు చేసారు. చేస్తున్నారు. పుష్ప లాంటి భారీ హిట్ తరువాత పుష్ప 2, రామచరణ్-బుచ్చిబాబు సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ తో సినిమా వుంది. ఇంకా చాలా వున్నాయి.

పైగా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ నిర్మాతలు చాలా మంది నవీన్ కు బంధువులు, క్లాస్ మేట్స్ కూడా. నవీన్ చూపిన దారిలో చాలా మంది సినిమా నిర్మాణంలోకి వచ్చారు. అందుకే అందరితో కలిసి తన 50 వ బర్త్ డే ను భారీగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.