ఫొటోలు ఆ సినిమావి.. అప్ డేట్ ఈ సినిమాది!

ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్న ఈ మెగా హీరో, అదే టైమ్ లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో…

ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్న ఈ మెగా హీరో, అదే టైమ్ లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. వీటిలో శక్తిప్రతాప్ సింగ్ సినిమాకు సంబంధించి తాజాగా 2-3 వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే టైటిల్ ఎనౌన్స్ మెంట్ అని చెప్పారు.

అంతా ఆ సినిమా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో, మరో సినిమా అప్ డేట్ తో ముందుకొచ్చాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు విడుదల తేదీ ఖరారు చేశాడు. గాండీవధారి అర్జున సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది.

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. అందుకే రిలీజ్ డేట్ లాక్ చేశారు. యూరోపియన్ దేశాలతో పాటు, అమెరికాలో ఈ సినిమాను షూట్ చేశారు.

ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సాక్షి వైద్య, ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. వరుణ్ ఇందులో సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.