పెద్ద హీరోలు అంటే నిర్మాతలు చేతులు కట్టుకుని వుంటారు. చిన్న హీరోలు అనేసరికి చిన్న నిర్మాత అయినా సరే దెబ్బేస్తారు. ఓ చిన్న హీరోతో ఓ చిన్న నిర్మాత ఓ సినిమా తీసారు. ఆఫ్ కోర్స్ దీనికి ఓ పెద్ద బ్యానర్ సపోర్ట్ వుందనుకోండి. చివరికి చేసి హీరోకు ఎన్ని అవమానాలు జరగాలో అన్నీ జరిగాయని టాలీవుడ్ లో వినిపిస్తోంది.
ప్రచారం ఖర్చుల్లో కోత వేయడం వాటిలో ఒకటి. ఇంకా ఇన్సల్ట్ ఏమిటంటే, విశాఖలో హీరో బృందం ప్రచారానికి హోటల్ లో దిగారు. నిర్మాతే రూమ్ లు బుక్ చేసారు. కానీ హోటల్ వాళ్లకు ముందుగానే ఓ మాట చెప్పారట.
రూమ్ అద్దెలు మాత్రమే తాను కడతాను. ఫుడ్ బిల్లులు హీరో దగ్గరే తీసుకోమని చెప్పారట. చెక్ అవుట్ టైమ్లో హీరో ఈ విషయం తెలిసి అవాక్కవడమే కాకుండా, చాలా అవమానంగా ఫీలయ్యాడని తెలుస్తోంది.
అంతే కాదు, ముందుగా అనుకున్న రెమ్యూనిరేషన్లో చివరకు వచ్చేసరికి నలభై శాతం కోత వేసారట. ఇంకేం మాట్లాడలేక, సినిమా ఆడితే చాలు అని హీరో సర్దుకుపోయినట్లు తెలుస్తోంది. కానీ ఈ నిర్మాత ట్రీట్ మెంట్ ఇలా వుంటుందని తెలిస్తే మళ్లీ మరే హీరో అయినా డేట్ లు ఇవ్వడానికి జంకుతారేమో?