రాజు దగ్గరకే కొండ

ఎంత రాజు అయినా కొండ దగ్గరకు రాదు. ఆయనే వెళ్లాల్సిందే అనేది పెద్దల మాట. కానీ ఇప్పుడు రోజులు మారాయి. రాజులు లేకున్నా, రాజరికం రేంజ్ లో వున్నవారు తలుచుకుంటే కొండయినా దగ్గరకు రావాల్సిందే. …

ఎంత రాజు అయినా కొండ దగ్గరకు రాదు. ఆయనే వెళ్లాల్సిందే అనేది పెద్దల మాట. కానీ ఇప్పుడు రోజులు మారాయి. రాజులు లేకున్నా, రాజరికం రేంజ్ లో వున్నవారు తలుచుకుంటే కొండయినా దగ్గరకు రావాల్సిందే. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అందరికీ తెలిసిందే. దానికి తోడు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఫుల్ జోష్ తో వున్నారు. ఈస్ట్, వెస్ట్ లో పర్యటిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఆయన లేటెస్ట్ సినిమా బ్రో టీజర్ విడుదల ప్లాన్ చేసారు. 29న టీజర్ విడుదల కావాల్సి వుంది.

అంతా బాగానే వుంది. కానీ టీజర్ కు పవన్ డబ్బింగ్ బకాయి వుంది. కానీ పవన్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు. మహా అయితే ఇవ్వాళ రాత్రికో, రేపో మంగళగిరి చేరతారు. మరేం చేయాలి. అందుకే మొబైల్ డబ్బింగ్ యూనిట్ తీసుకుని దర్శ‌కుడు సముద్రఖని, డబ్బింగ్ టెక్నీషియన్లు ఛలో మంగళగిరి అంటూ పయనమై వెళ్లారు.

పవన్ తన పొలిటికల్ యాత్ర బడలిక నుంచి కాస్త సేద తీరాలి. ఆ మూడ్ నుంచి బయటకు రావాలి. అప్పుడు టీజర్ లో వున్న డైలాగులు డబ్బింగ్ చెప్పాలి. అదీ విషయం. పవన్ అనే కాదు, ఏ టాప్ హీరో అయినా ఇప్పుడు రాజగారి లెవెల్ నే. కొండ అయినా దగ్గరకు రావాల్సిందే.