యాంకర్, నటి అనసూయ అసలే వివాదాల్లో తలమునకలై వుంటుంది. అందాలు ఆరబోస్తుంటే కొందరికి నచ్చడం లేదు. ఈ వయసులో ఏంటీ వికారాలంటూ నెటిజన్లు చీవాట్లు పెడుతుంటారు. “నా శరీరం, నా అందం, నా ఇష్టం” అని వర్మ రేంజ్‌లో నెటిజన్లకు ఆమె క్లాస్ పీకుతుంటారు. సోషల్ మీడియాతో అనసూయకు విడదీయలేని అనుబంధం. ఆమే అందాలను ఆరబోయకపోతే నెటిజన్లకు పనే వుండేది కాదేమో అనే అభిప్రాయం కూడా లేకపోలేదు.
ఏదో తన మానాన సినిమాలు, టీవీ షోలు చేసుకుంటున్న అనసూయను వైసీపీ ఎమ్మెల్యే రాజకీయాల్లోకి లాగారు. అది కూడా జనసేనాని పవన్‌కల్యాణ్ సభలకు జనం రావడాన్ని ప్రస్తావిస్తూ…ఓయబ్బా చూశాం లే, యాంకర్ అనసూయ వచ్చినా అని వైసీపీ ఎమ్మెల్యే వెటకారంగా మాట్లాడారు. ఇంతకూ రాజకీయ వివాదంలోకి అనసూయను లాగిన ఆ ఎమ్మెల్యే ఎవరంటే…పవన్‌పై భీమవరంలో గెలిచిన గ్రంథి శ్రీనివాస్.
వారాహి యాత్ర నిర్వహిస్తున్న పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తన సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతంలో యాత్ర మొదలు పెట్టాలని ఆయన వ్యూహాత్మకంగా నిర్ణయించుకున్నారు. మొదటి దశ యాత్ర ముగింపు దశకు చేరింది. ఈ నేపథ్యంలో పవన్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.
సినిమా వాళ్లకి ప్రజల్లో ఆదరణ వుంటుందని భీమవరం ఎమ్మెల్యే అన్నారు. యాంకర్ అనసూయ రాజమండ్రి వచ్చినా జనం కిక్కిరిసిపోతారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అనసూయ ఒక్కరినే పోల్చి భీమవరం ఎమ్మెల్యే మిగిలిన మహిళా నటుల్ని విడిచిపెట్టారు. సెక్సీ యాక్టర్స్‌తో పోల్చి పవన్‌ను మరింతగా బద్నాం చేయనందుకు జనసేన సంతోషించాలేమో!