రోజా Vs నాగబాబు..రాజకీయ జబర్దస్త్

వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేయడంలో భాగంగానే కూటమి ప్రభుత్వం నాగబాబును క్రీడల మంత్రిగా రంగంలోకి దింపుతోందనే ప్రచారం జరుగుతోంది.

ఒకప్పుడు కలిసి జబర్దస్ట్ చేశారు. ఒకే టీమ్ గా పక్కపక్కన కూర్చొని జడ్జీలుగా పని చేశారు. రాజకీయాల్లో మాత్రం రోజా, నాగబాబు దారులు వేరు. ఆమె వైసీపీలో ఉన్నారు. నాగబాబు జనసేనలో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య పొలిటికల్ గా మాటల యుద్ధం కూడా నడిచింది. ఇప్పుడా యుద్ధం నెక్ట్స్ లెవెల్ కు చేరబోతోంది. పొలిటికల్ స్క్రీన్ పై నాగబాబుతో రోజాకు చెక్ పెట్టాలని చూస్తోంది కూటమి సర్కారు.

నాగబాబు మంత్రి పదవికి లైన్ క్లియర్ అయింది. ఆయన్ను ఎమ్మెల్సీగా మండలికి పంపించబోతున్నారు. అట్నుంచి అటు మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ఉంటుంది. అందులో నాగబాబు గెలుపు లాంఛనమే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాదికి నాగబాబు మంత్రిమండలిలోకి ప్రవేశిస్తారు.

కేబినెట్ లోకి వచ్చిన తర్వాత ఆయనకు సినిమా, క్రీడా మంత్రిత్వ శాఖల్ని అప్పగించే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వడం సమంజసం. మరి క్రీడల శాఖను ఎందుకు అప్పగిస్తున్నట్టు? ఇక్కడే అన్ని వేళ్లు రోజా వైపు చూపిస్తున్నాయి.

వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేయడంలో భాగంగానే కూటమి ప్రభుత్వం నాగబాబును క్రీడల మంత్రిగా రంగంలోకి దింపుతోందనే ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా కొన్నేళ్లు పనిచేశారు రోజా. ఆమె ఆధ్యర్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆడుదాం ఆంధ్రా పోటీల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు కొంతమంది టీడీపీ నేతలు.

వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు, రోజా కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ‘ఆడుదాం ఆంధ్ర’లో అవకతవకలపై విచారణ కోసం ప్రత్యేక స్వతంత్ర కమిటీని ఏర్పాటుచేసింది. ఇప్పుడు నాగబాబును మంత్రిగా దింపి, రోజాతో చెడుగుడు ఆట ఆడాలని కూటమి ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన చాలామంది కీలక నేతలు టార్గెట్ గా మారారు. వల్లభనేని వంశీ నుంచి పెద్దిరెడ్డి, పోసాని వరకు ఎంతోమందిని రెడ్ బుక్ పేరిట కేసులతో సతాయిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రోజాను చేర్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీని కోసం నాగబాబు సేవల్ని వాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

18 Replies to “రోజా Vs నాగబాబు..రాజకీయ జబర్దస్త్”

  1. ఏమిటో నీ బాధ? మొన్న నెక్స్ట్ టార్గెట్ గోరంట్ల మాధవ్ అన్నావ్. నిన్న విడుదల రజిని అన్నావ్. ఇప్పుడు రోజా అంటున్నవ్. క్లారిటీ లేదు పుష్పా!!!

  2. కేసుల పేరిట సతాయిస్తున్నారా?అంటే కేసులో నిజం లెదంతాలవా?

  3. 100% స్ట్రైక్ రేట్ తో The most respected Dy సీఎం అయిన నీ మొగుడంటే కనీస గౌరవం లేకుండా, ఏంటా పనికిమాలిన పంచులు ల0గా మోహనా?? మంచిగా కాపురం చేసుకో, వారసుణ్ణి ప్రసాదిస్తాడు ఏమంటావ్??

  4. రెడ్ బుక్ పేరిట కేసులతో సతాయిస్తున్నారా.. అంటే అవి వాళ్ళు చేసిన తప్పులకు, నేరాలకు శిక్షలు కాదన్నమాట.. ఇలాంటి రాతలతో సంపాదించిన వాటితో మీ కుటుంబం హాయిగా ఉంటుందా సార్. పార్టీ పరంగా వైసిపి కి ఎంతైనా సపోర్ట్ చెయ్యండి, రాజకీయంగా ఒప్పుకుంటారు, తప్పులు చూపితే ఆహ్వానిస్తారు, సరిదిద్దు కోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇలాంటి నోటి దురదతో రెచ్చిపోయిన వాళ్ళకోసం అనవసరంగా ఆర్టికల్స్ రాయకండి ప్లీజ్

  5. సినిమా ఫీల్డ్ లో ఉన్నంత సేపు బెంజ్ కార్లు లేవు కేవలం చెక్ బౌన్స్ కేసులు తప్ప వైసీపీ లోకి వచ్చాక మాత్రం ఆస్తులు ఎస్టేట్ లు బెంజ్ కార్ లు వచ్చాయి ఇప్పుడు నాగ బాబు కూడా ఆడుదాం ఆంధ్ర ఆడతాడు బెంజ్ కార్ ల సంగతి చూస్తాడు

Comments are closed.