టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య తేడా కొడుతోంది!

జ‌గ‌న్ భ‌యం లేక‌పోతే, చంద్ర‌బాబుతో త‌మ నాయ‌కుడు క‌లిసి వుండేవారే కాద‌ని జ‌న‌సేన నాయ‌కులు అంటున్న మాట‌.

ఇంకా 15 ఏళ్ల పాటు టీడీపీతో క‌లిసే వుంటామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించి రోజుల వ్య‌వ‌ధిలోనే …ఆ రెండు పార్టీల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న భావ‌న ఏర్ప‌డ్డం గ‌మ‌నార్హం. దీనికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక కార‌ణం కావ‌డం గ‌మ‌నార్హం. రెండు రాజ‌కీయ పార్టీలు క‌లిశాయంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, మ‌రే కార‌ణాలు వుండ‌వు. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని బ‌లిపెట్టి, ఏళ్ల త‌ర‌బ‌డి టీడీపీ జెండా మోయాల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనుకున్నా, జ‌న‌సేన శ్రేణులు ఒప్పుకునే ప‌రిస్థితి వుండ‌దు.

అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను విడిచి పెట్ట‌డానికి కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వెనుకాడ‌రు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌, జ‌న‌సేన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబుకు ఎమ్మెల్సీ, మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని చాలా కాలం నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబే అధికారికంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంలో టీడీపీ లెడ‌ర్‌పాడ్‌పై ప్ర‌క‌టించారు కూడా.

తీరా ఎమ్మెల్సీ ఎన్నిక స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి, టీడీపీ పెద్ద‌ల్లో చెడు ఆలోచ‌న క‌లిగింది. నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌విని ప‌వ‌నే వ‌ద్ద‌న్నార‌ని, మంచి కార్పొరేష‌న్ సంస్థ‌కు చైర్మ‌న్‌గా చేస్తే చాల‌న్నార‌ని త‌మ ప‌త్రిక‌లో క‌థ‌నం రాయించారు. టీడీపీ ఇలా నాగ‌బాబు ప‌ద‌విపై తాను చెప్ప‌ని విష‌యాన్ని రాయించ‌డం ప‌వ‌న్‌కు కోపం తెప్పించింది. ఇక రెండో ఆలోచ‌నే లేకుండా, త‌న‌కు తానుగా నాగ‌బాబు ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం నామినేష‌న్ వేయాల‌ని, ఈ మేర‌కు అన్నీ సిద్ధం చేయాల‌ని ప‌వ‌న్ ఆదేశించిన‌ట్టు జ‌న‌సేన త‌న అధికారిక సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించి, టీడీపీకి షాక్ ఇచ్చింది.

చంద్ర‌బాబుతో ఏ మాత్రం సంబంధం లేకుండా, ప‌వ‌న్‌క‌ల్యాణే త‌మ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా నాగ‌బాబు పేరు ప్ర‌క‌టించ‌డాన్ని గ‌మ‌నించాలి. త‌ద్వారా టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య అంత‌ర్గ‌తంగా విభేదాలున్నాయ‌న్న సంగ‌తి బ‌య‌ట ప‌డింది. గ‌తంలో ఎన్నిక‌ల ముందు కూడా జ‌న‌సేన‌తో చ‌ర్చించ‌కుండా టీడీపీ రెండుచోట్ల ఎమ్మెల్యే అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌గా, తామేం త‌క్కువ కాద‌ని, ప‌వ‌న్ కూడా అదే ప‌ని చేసి, అప్ప‌ట్లో తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపారు.

ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ అదే పున‌రావృతం కావ‌డం గ‌మ‌నార్హం. ప‌ద‌వుల‌తో ప‌నిలేనంత వ‌ర‌కూ రాజ‌కీయంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ మ‌ధ్య సంబంధాలు బాగుంటాయి. వాళ్లిద్ద‌రూ క‌లిసే ఉంటారు. కానీ ప‌ద‌వుల ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి కోరుకున్న విధంగా జ‌ర‌గ‌క‌పోతేనే అస‌లు స‌మ‌స్య‌. చంద్ర‌బాబుతో క‌లిసి వుండాల‌నే ఆకాంక్ష ప‌వ‌న్‌లో ఎంతో బ‌లంగా ఉన్నా, ప‌ద‌వుల ప్ర‌యోజ‌నాల ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి, అది సాధ్యం కాదు. అదే రాజ‌కీయం స్వ‌భావం అని ప‌వ‌న్‌కు ఇప్ప‌టికి జ్ఞానోద‌యం అయి వుంటుందేమో!

ఏది ఏమైనా నాగ‌బాబుకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌కూడ‌ద‌ని టీడీపీ ఎందుకు అనుకుంటున్న‌దో అంతు చిక్క‌డం లేదు. నాగ‌బాబుకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి టీడీపీ భ‌య‌ప‌డుతోందా? లేక లెక్క‌లేనిత‌న‌మా? అనేది అర్థం కావ‌డం లేద‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ వ్య‌వ‌హ‌రించిన తీరు జ‌న‌సేన‌కు న‌చ్చ‌డం లేదు. అయితే చంద్ర‌బాబుతో క‌లిసి లేక‌పోతే జ‌న‌సేన ఉనికికే ప్ర‌మాదం అనే భ‌యంతో అనివార్యంగా క‌లిసి వుండేలా చేస్తోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

జ‌గ‌న్ భ‌యం లేక‌పోతే, చంద్ర‌బాబుతో త‌మ నాయ‌కుడు క‌లిసి వుండేవారే కాద‌ని జ‌న‌సేన నాయ‌కులు అంటున్న మాట‌. ఇంత‌కు మించి, రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ అన్యోన్న‌త‌కు ప్ర‌త్యేక కార‌ణం లేద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. అయితే ఇలా ఎంత కాలం అనేదే ప్ర‌శ్న‌.

10 Replies to “టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య తేడా కొడుతోంది!”

  1. ఒరే వెంకటప్పా, నీకు ఏమి చెపుతున్నాను? వాళ్లది వాళ్లు కడుక్కుంటారు. ముందు మన సంగతి చూసుకో. అక్కడ అన్న పంచులు, లుంగీలు, లంగాలు అని ఎగురుతున్నావు. తీరా చూస్తే మళ్ళీ మళ్ళీ కొండ ఎర్రిపప్ప అవుతున్నాడు

  2. పోయన ఎలేచ్షన్స్ కి ముందు కూడా ఇలానే అన్నారు గుర్తుందా పొత్తు లో యెడ తేడా కొడుతోంది చంబా పవన్ కి చెప్పకుండా అభ్యర్థుల్ని ఖరాలు చేసేస్తే పోటీ గ జనసేన కూడా ఖరారు చేసింది..అలానే అధికారం లోకి వచ్చిన రోజల వ్యవధి లో నే టీడీపీ జనసెన కార్యకర్తల మధ్య గొడవ లు జరుగుతున్నాయి ..అది ఇది అని రాసారు…కానీ తర్వాత అలంటి రాతలు తగ్గిపోయాయి…ఎందుకొచ్చిన తిప్పలు హాయ్ గ కళ్ళు మూసుకుంటే పోలా ఎటు ఏడాది ఐపొవస్తుంది నాలుగేళ్లు ఎంతలోకి

  3. పాపం! బులుగు మీడియా కలలు కంటుంది!

    ఈ ఆర్తికల్ మొత్తం చడవటం కూడా దండగె! నెను చదవలెదు! బొదిశా అదె ఎడుపు అయ్యి ఉంటుంది!

    .

  4. మనిషి ఆశా జీవి అంటే ఏమిటో అనుకున్నా!!!రెండు రోజులకు ఒకసారి కూటమిలో లుకలుకలు అని నీ గూలానందం చూసాకా అర్ధం అయింది

  5. వాళ్ళు కలిశారు అన్న దగ్గర నుంచి ఇలాగె రాసావు .. ఏమైంది .. మనం ఇంట్లో కూర్చున్నాము .. అయినా వాళ్ళని కలిసేలా చేయడం ఎందుకు .. ఇప్పుడు ఏడవడం ఎందుకు ..

  6. కమ్మ వాళ్ళతో వెళ్లడం కాపులకు కంఫర్ట్ గానే వుంది కాపులతో వెళ్లడం కమ్మ వాళ్లకు కంఫర్ట్ గానే వుంది ముఖ్యం గ cbn పవన్ కళ్యాణ్ గార్లకు ఎటొచ్చి ఇబ్బంది గ వున్నది వైసీపీ కె కాబట్టి మీరు ka పాల్ గారితో కలిసి వెళ్లడమే బెస్ట్

Comments are closed.