జ‌గ‌న్ చ‌ట్టం, బాబు చ‌ట్టం.. ఏంటి తేడా?

గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ చేప‌ట్టిన రీస‌ర్వేను త‌ప్పు ప‌ట్టి, ఇప్పుడు అదే ప‌ని కూట‌మి స‌ర్కార్ చేయ‌డాన్ని ఎలా చూడాలి?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భూఆక్ర‌మ‌ణ‌ల‌పై ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చ‌ట్టం తీసుకొచ్చామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ చెబుతోంది. ఈ చ‌ట్టాన్ని అసెంబ్లీ, మండ‌లి ఆమోదించాయ‌ని, కేంద్ర‌ప్ర‌భుత్వం వెంట‌నే అధికారిక ముద్ర వేయాల‌ని కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షాను సీఎం చంద్ర‌బాబు కోర‌డం విశేషం.

నిజంగా భూఆక్ర‌మ‌ణ‌దారుల‌పై ఉక్కు పాదం మోపాలంటే, ఆల్రెడీ ఉన్న చ‌ట్టాల్ని చిత్త‌శుద్ధితో అమ‌లు చేస్తే చాల‌ని న్యాయ నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ప్ర‌ధానంగా భూముల్ని ఆక్ర‌మించేందుకు తెగ‌బ‌డేది అధికారంలో ఉన్న నేత‌లే. ఎందుకంటే భూముల్ని నిషేధిత జాబితాలో ఉంచాల‌న్నా, అలాగే వాటిని త‌మ వ‌శం చేసుకోవాల‌న్నా అధికార పార్టీ నాయ‌కుల మాట‌ల్ని రెవెన్యూ అధికారులు వినే సంగ‌తి చంద్ర‌బాబుకు తెలియ‌దా?

అంతెందుకు, అధికారంలోకి వ‌చ్చిన ఈ తొమ్మిది నెల‌ల్లో నిఘా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు భూఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల్ని చంద్ర‌బాబు పిలిచి మంద‌లించార‌ని అధికార వ‌ర్గాలే చెబుతున్నాయి. భూఆక్ర‌మ‌ణ‌ల‌కు సంబంధించి స‌ర్వ అవ‌ల‌క్ష‌ణాల‌కు అధికార‌మే కార‌ణం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌భుత్వ భూముల్ని సైతం ఏదో ర‌కంగా సొంతం చేసుకుంటున్న నాయ‌కులు ఎంద‌రో ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల్ని కూట‌మి నేత‌లు ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. త‌మ అనుమ‌తి లేనిదే భూక్ర‌య‌విక్ర‌యాలు చేయ‌కూడ‌ద‌నే స్థాయికి కూట‌మి నేత‌లు వెళ్లారు. అంతేకాదు, భూముల రిజిస్ట్రేష‌న్ల స‌మాచారాన్ని కూట‌మి నేత‌లు తెప్పించుకుని, డిమాండ్ చేసి మ‌రీ వసూళ్ల‌కు పాల్ప‌డుతున్న సంగ‌తి ప్ర‌భుత్వ పెద్ద‌లకు తెలియ‌దా?

గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో వైసీపీ నాయ‌కులు భూముల్ని ఆక్ర‌మిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసి ఎన్నిక‌ల్లో భారీ ల‌బ్ధి పొందారు. అసెంబ్లీలో ఈ బిల్లు తీసుకొచ్చే సంద‌ర్భంలో ఎంతో గొప్ప‌ద‌ని టీడీపీ స‌భ్యుడు ప‌య్యావుల కేశవ్ కీర్తించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నిక‌ల్లో మాత్రం అందుకు విరుద్ధంగా రైతుల్ని, ఇత‌ర ప్ర‌జానీకాన్ని భ‌య‌పెట్టేలా టీడీపీ ప్ర‌చారం చేయ‌డం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ యాక్ట్‌ను ర‌ద్దు చేసింది.

గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కార్ చేప‌ట్టిన రీస‌ర్వేను త‌ప్పు ప‌ట్టి, ఇప్పుడు అదే ప‌ని కూట‌మి స‌ర్కార్ చేయ‌డాన్ని ఎలా చూడాలి? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్థానంలోనే చంద్ర‌బాబు స‌ర్కార్ కొత్త‌గా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చ‌ట్టం తీసుకొచ్చింద‌న్న‌ది వాస్త‌వం అని న్యాయ నిపుణులు అంటున్నారు. పేరు మార్పే త‌ప్ప‌, చంద్ర‌బాబు స‌ర్కార్ కొత్త‌గా భూముల్ని కాపాడేందుకు చేస్తున్న‌దేమీ లేద‌నే మాట వినిపిస్తోంది. ప్ర‌తి దానికీ చ‌ట్టాలున్నాయ‌ని, అయితే వాటిని అమ‌లు చేయ‌డంలో ప్ర‌భుత్వాలు చిత్త‌శుద్ధితో ప‌ని చేయ‌క‌పోవ‌డమే అస‌లు స‌మ‌స్య అనే వాద‌న వినిపిస్తోంది. దీన్ని కొట్టి పారేయ‌లేం.

7 Replies to “జ‌గ‌న్ చ‌ట్టం, బాబు చ‌ట్టం.. ఏంటి తేడా?”

  1. తేడా ఏంటో తెలీదా GA గారూ.. “మనిషి” ..

    వివరంగా చెప్పాలంటే.. భూదాహం, అక్రమ ఆక్రమణలు, అవినీతి, నేర చరిత్ర, కుటుంబ నేపథ్యం.. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే ఎవరి చట్టం నమ్మాలో ఎవరి చట్టం నమ్మకూడదో తేడా మీ మట్టి బుర్రకు ఈజీ గా అర్థమైపోతుంది

  2. తేడా తెలియదా? అప్పట్లో రీసర్వే తరువాత దిష్టిబొమ్మ తో పాసు పుస్తకం….ఇప్పుడు రాజముద్ర.అప్పట్లో సరిహద్దు రాళ్ల పై దిష్టిబొమ్మ, ఇప్పుడు లేవు

  3. రైతులకి కోపం వచ్చినప్పుడల్లా పొలం లో ఉన్న జెగ్గులు గాడి carved స్టోన్ మీద ఉచ్చా పోసి, ‘చెప్పుతోకొట్టి వచ్చేవాళ్లంట.. చంద్రబాబు ఆ ఛాన్స్ తీసేస్తున్నాడు

Comments are closed.