ఎన్టీఆర్ బర్త్ డే న ‘బి బి 3’ ?

బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా బిబి 3. ఈ సినిమా టైటిల్, విడుదల తేదీ ఈ రోజు సాయంత్రం ప్రకటిస్తారు. ఒక్క టీజర్ తోనే ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. …

బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా బిబి 3. ఈ సినిమా టైటిల్, విడుదల తేదీ ఈ రోజు సాయంత్రం ప్రకటిస్తారు. ఒక్క టీజర్ తోనే ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. 

టాలీవుడ్ లో ప్రొడక్షన్ లో వున్న దాదాపు అన్ని సినిమాల డేట్ లు వచ్చేసాయి. రాధేశ్యామ్, పూరి జగన్నాధ్, బాలయ్య సినిమాలు తప్ప. ఇప్పుడు బాలయ్య సినిమా డేట్ కూడా వచ్చేస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ జయంతి రోజు అయినా మే 28న 'బి బి 3' సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. 

ఇదే నెలలో చిరంజీవి ఆచార్య, వెంకీ నారప్ప సినిమాలు కూడా వున్నాయి. ఇక మిగిలింది నాగార్జున వైల్డ్ డాగ్ మాత్రమే. ఆ సినిమా డేట్ కూడా ఇదే నెలలో వేస్తే సీనియర్ల సినిమాలు అన్నీ ఒకటే నెలలో విడుదలయినట్లు అవుతుంది.

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..