కర్నాటకలో ‘లోకల్ ఫీలింగ్’

మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావ్..మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్ అన్న వ్యవహారాలు అన్ని సార్లు నడవ్వు. మన సినిమాలు బెంగళూరులో ఆడేసి కోట్లు తెచ్చేయాలి. కానీ వాళ్ల సినిమాలకు మనం వీలు…

మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావ్..మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్ అన్న వ్యవహారాలు అన్ని సార్లు నడవ్వు. మన సినిమాలు బెంగళూరులో ఆడేసి కోట్లు తెచ్చేయాలి. కానీ వాళ్ల సినిమాలకు మనం వీలు కాదంటే ఎలా? మొహమాటానికైనా కాసిన్ని థియేటర్లు ఇవ్వాల్సిందే. కర్ణాటకలో ఇప్పుడు ఇదే డిస్కషన్ నడుస్తోంది.

దర్శన్ నటించిన రాబర్ట్ సినిమా విడుదలకు రెడీ అయింది. ఆ సినిమా అక్కడ భారీ సినిమా. ఆ నిర్మాతలే పలు సౌత్ లాంగ్వేజెస్ లో విడదుల చేసుకుంటున్నారు. కానీ దానికి ఫిక్స్ అయిన డేట్ తోనే తలకాయనొప్పి. మార్చి 11న ఆ సినిమా అక్కడ విడుదల.

అదే రోజుకు మన దగ్గర మూడు నాలుగు సినిమాలు కొట్టుకునే పరిస్థితి వుంది. దాంతో ఇక్కడ థియేటర్లు దొరకడం కష్టం అని వాళ్లకి క్లారిటీ ఇచ్చేసారు. కానీ తెలుగు సినిమాలు, తెలుగు డబ్బింగ్ సినిమాలు ఇక్కడ మనం వేస్తున్నాం, మన సినిమాకు థియేటర్లు ఇవ్వరా అన్న డిస్కషన్ అక్కడ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. 

తెలుగు సినిమాలకు బెంగళూరు పెద్ద మార్కెట్. ఇప్పుడు అక్కడ వన్స్ లోకల్ ఫీలింగ్ స్టార్ట్ అయితే చాలా కష్టం అవుతుంది. హీరో దర్శన్, ఆ సినిమా యూనిట్ కన్నడ ఫిలిం చాంబర్ ను కలిసి పరిస్థితి వివరించారు. ఆ తరువాత దర్శన్ అక్కడి మీడియాతో కూడా మాట్లాడారు. 

మనం వాళ్ల సినిమాలకు గౌరవం ఇస్తున్నాం, వాళ్ల ప్లాన్ ల ప్రకారం విడుదల చేసుకోనిస్తున్నాం. మరి అదే పరిస్థితి మన సినిమాలకు కూడా వుండాలి కదా అన్నది ఆయన పాయింట్. తను తట్టుకోగలనని, మిగలిన వారంతా అలా తట్టుకోగలరా అని అడుగుతున్నాడు. ఇదేదో చినికి చినికి గాలివాన అయ్యేలాగే వుంది.

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..