నైజాం..ఉప్పెన తకరారు

చేతిలో అయిదారు భారీ సినిమాలు వున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగుతోందని ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరిలో విడుదలయ్యే ఉప్పెన సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్…

చేతిలో అయిదారు భారీ సినిమాలు వున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగుతోందని ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరిలో విడుదలయ్యే ఉప్పెన సినిమాతోనే డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించాలన్న ఆలోచన కు బ్రేక్ పడుతోందని తెలుస్తోంది.

ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కథనం ప్రకారం ఈ వ్యవహారం అంతా ఇలా వుంది. ఉప్పెన సినిమాను ఏడాది కిందటే నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు నాలుగు కోట్లకు బేరం ఫిక్స్ అయింది.

కొటి అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగిందనో, లేదు మాట మాత్రమే అయిందనో కూడా పాయింట్లు వున్నాయి. అయితే కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది. కరోనా అనంతరం విడుదల ప్లాన్ చేస్తున్నపుడు మారిన పరిస్థితుల్లో ఆ రేటు హానర్ చేయలేనని దిల్ రాజు అన్నట్లు తెలుస్తోంది.

దాంతో తామే విడుదల చేసుకుంటామని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ఆలోచన స్టార్ట్ చేసింది. దీనికి ఇఫ్పడు దిల్ రాజు మళ్లీ అడ్డం పడుతున్నారని తెలుస్తోంది. తనకు మాట అయిన సినిమాను ఎలా పంపిణీ చేస్తారని, తనకే ఇవ్వాలని, కావాలంటే ఆ తరువాత సినిమాతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసుకోవాలని అంటున్నాట్లు బోగట్టా. 

మీరు వద్దంటేనే కదా డిస్ట్రిబ్యూషన్ ఆలోచన చేసింది, ఇప్పుడు మళ్లీ కావాలంటే ఎలా అని మైత్రీ మూవీస్ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఈ పంచాయతీ నడుస్తోంది. ఎటు తెగుతుందో చూడాల్సి వుంది.

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?

కబుర్లు చెప్పడంలో దిట్ట పవన్ కల్యాణ్..