ఖిలాడి కి బ్యాడ్ సెంటిమెంట్

టాలీవుడ్ లో ఓ యాంటీ సెంటిమెంట్ వుంది. మంచినటుడు, యాక్షన్ కింగ్ సీనియర్ అర్జున్ సోలోగా నటిస్తే సినిమాలు భలేగా వుంటాయి కానీ అదే సీనియర్ అర్జున్ తెలుగు హీరోల సినిమాల్లో మాంచిస్పెషల్ క్యారెక్టర్…

టాలీవుడ్ లో ఓ యాంటీ సెంటిమెంట్ వుంది. మంచినటుడు, యాక్షన్ కింగ్ సీనియర్ అర్జున్ సోలోగా నటిస్తే సినిమాలు భలేగా వుంటాయి కానీ అదే సీనియర్ అర్జున్ తెలుగు హీరోల సినిమాల్లో మాంచిస్పెషల్ క్యారెక్టర్ చేస్తే, అంతా బాగుంటుంది కానీ సినిమా హిట్ అన్నది మాత్రం గ్యారంటీ తక్కువగా వుంటుంది.

అల్లు అర్జున్ నటించిన నా ఇల్లు ఇండియా నా పేరు సూర్య, నితిన్ లై, ఆంజనేయ అంతకు ముందు రామ్ రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలు అన్నీ డిజాస్టర్లే.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ప్రామిసింగ్ ప్రాజెక్టు అనిపిస్తున్న రవితేజ ఖలాడి సినిమాలో సీనియర్ అర్జున్ నటిస్తున్నారని యూనిట్ ప్రకటించింది. అర్జున్ నటిస్తున్నారంటే అది కచ్చితంగా నటించడానికి స్టామినా వున్న ప్రత్యేకమైన పాత్ర అయి వుంటుంది. ఆయన దానికి న్యాయం చేస్తారు కూడా. అందులో అణుమాత్రం సందేహం లేదు.

కానీ ఇప్పటి వరకు అర్జున్ తెలుగులో ప్రత్యేక పాత్రలు చేసిన సినిమాలను తలుచుకుంటేనే..చిన్న అనుమానంగా వుంది. రవితేజ సినిమాల్లోనే భారీ బడ్జెట్ తో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ఇది.

చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. 

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?