మరోసారి పోటీపడుతున్న సమంత-కాజల్

ఒకప్పుడు సమంత-కాజల్ మధ్య గట్టి పోటీ నడిచేది. ఎవరు నంబర్ వన్ అంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చేవి. ఆ తర్వాత ఇద్దరూ సినిమాలు తగ్గించారు. మళ్లీ ఇన్నేళ్లకు వీళ్లిద్దరి మధ్య పోటీ మొదలైంది.…

ఒకప్పుడు సమంత-కాజల్ మధ్య గట్టి పోటీ నడిచేది. ఎవరు నంబర్ వన్ అంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చేవి. ఆ తర్వాత ఇద్దరూ సినిమాలు తగ్గించారు. మళ్లీ ఇన్నేళ్లకు వీళ్లిద్దరి మధ్య పోటీ మొదలైంది. గతంలో సిల్వర్ స్క్రీన్ పై పోటీపడిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు, ఈసారి ఓటీటీ వేదికగా పోటీకి సై అంటున్నారు.

సమంత ఫస్ట్ టైమ్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. సూపర్ హిట్టయిన ఫ్యామిలీ మేన్ వెబ్ సిరీస్ లో మహిళా టెర్రరిస్ట్ పాత్ర పోషించింది. ఫిబ్రవరి 12 నుంచి సీజన్-2 అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

సరిగ్గా అదే రోజున కాజల్ నటించిన 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు రాబోతోంది. డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 12 నుంచి దీన్ని షెడ్యూల్ చేశారు. కాజల్ కు కూడా ఇదే తొలి ఓటీటీ ఎంట్రీ. ఇలా కాజల్-సమంత ఇద్దరూ తమ తొలి ఓటీటీ వెంచర్స్ తో ఒకేసారి పోటీపడుతున్నారు.

ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఫ్యామిలీ మేన్ లో పాత్రను తన కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ గా చెప్పుకొస్తోంది సమంత. అటు కాజల్ కూడా 'లైవ్ టెలికాస్ట్' పాత్ర, తన కెరీర్ బెస్ట్ అని చెబుతోంది. చూస్తుంటే… వీళ్లిద్దరూ ఈ వెబ్ సిరీసులపై చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నారు.

చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్న నిమ్మగడ్డ.. 

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?