ఓ దర్శకుడి నిర్వేదం

అతనో యంగ్ డైరెక్టర్. ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ తనకేం అక్కడ పెద్దగా పని లేదని వెళ్లి రావడంతో సరిపోతోందని, అంతా హీరోనే చేసుకుంటున్నాడని తెలుసున్న వాళ్ల దగ్గర వాపోతున్నాడట. అందుకే ఆ…

అతనో యంగ్ డైరెక్టర్. ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కానీ తనకేం అక్కడ పెద్దగా పని లేదని వెళ్లి రావడంతో సరిపోతోందని, అంతా హీరోనే చేసుకుంటున్నాడని తెలుసున్న వాళ్ల దగ్గర వాపోతున్నాడట. అందుకే ఆ సినిమా సంగతి అలా వుంచి, తరువాత సినిమా ఎలా తెచ్చుకోవాలా అనే ప్రయత్నాలు సీరియస్ గా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సినిమా దర్శకత్వంలో హీరోలు వేళ్లు..కాళ్లు పెట్టడం మామూలే. అయితే ఈ విషయంలో ఈ దర్శకుడు పని చేస్తున్న హీరో పది రెట్లు ఎక్కువంట. అన్నీ తానై చేసేసుకుంటాడని టాక్.

బహుశా అందుకే తనకు పెద్దగా అక్కడ చేసే అవకాశం ఏమీ లేదని ఈ దర్శకుడు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే ఒకరిద్దరు యంగ్ హీరోలకు ఏ దర్శకుడు పని చేసినా పెద్దగా వాళ్లకి పేరు రాదు క్రెడిట్ అంతా హీరోలకే పోతుంది. అందుకే ఈ యంగ్ హీరోలు చేసే సినిమాకు ఒకసారి పని చేసిన దర్శకులు మరోసారి పని చేయరు. వేరే దారి వెదుక్కుంటారు. అలా వెదుక్కున్నా కూడా పెద్దగా క్లిక్ అయిన సందర్భాలు తక్కువ.

అంటే ఈ యంగ్ హీరోలు కాళ్లు, వేళ్లు పెట్టినా సినిమా సక్సెస్ కోసమే. వాళ్లకు ఆ టాలెంట్ వుంది. కానీ దర్ళకులుగా పేరు వేసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి. అలా అన్నీ తెలిసి ఆ హీరోల సినిమాలకు దర్శకులుగా వెళ్లిన తరువాత ఇక ఇలా వగచి లాభం లేదు కదా.