తమ్ముళ్ళు బరిలోకి దిగుతారా?

ఎన్నికలు అంటేనే బస్తీ మే సవాల్. కుస్తీ పోటీలు. సై అంటే సై అనాలి. రెడీ అంటే ఢీ కొట్టాలి. మరి హైదరాబాద్ లో జూమ్ యాప్ ముందు కూర్చుని చంద్రబాబు బాగానే పిలుపు…

ఎన్నికలు అంటేనే బస్తీ మే సవాల్. కుస్తీ పోటీలు. సై అంటే సై అనాలి. రెడీ అంటే ఢీ కొట్టాలి. మరి హైదరాబాద్ లో జూమ్ యాప్ ముందు కూర్చుని చంద్రబాబు బాగానే పిలుపు ఇస్తున్నారు. ఒక్కచోటా పొల్లుపోకుండా నామిమేషన్లు గట్టిగానే పడాలని పెద్దాయన కోరుతున్నారు.

కానీ గ్రౌండ్ లెవెల్ లో సీన్ అలా ఉందా అన్నదే కీలకమైన  ప్రశ్న. ఎందుకంటే పంచాయతీలలో ఎన్నికలు అంటేనే గ్రామ కక్షలు మొదలవుతాయి. వర్గ పోరు  పెచ్చరిల్లుతుంది. దాంతో ఏ సర్కార్ అధికారంలో ఉంటే దానికి మద్దతుగా ఉన్న వారిని ఎన్నుకుని అభివృద్ధికి నిధులు తెచ్చుకోవడం ఒక సంప్రదాయంగా ఉంది. ఈ క్రమంలోనే ఏకగ్రీవాలు కూడా ముందుకు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే గత ఏడాది పార్టీ గుర్తు మీద జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి తమ్ముళ్ళు వెనకంజ వేశారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే తమ్ముళ్ళు పోటీకి ససేమిరా అనేశారు. సీనియర్ నేత కళా వెంకటరావు ఇలాకాలోనే ఏకగ్రీవాలు భారీగా జరిగాయి.

ఇక మరో చిత్రమేంటి అంటే పోటీ చేయడానికి  టీడీపీకి అరవై డెబ్బై చోట్ల అభ్యర్ధులే దొరకలేదు ఆనాడు. మరి ఇపుడు ఏడాదిలో పెద్దగా మార్పు వస్తుంది అనుకోవడానికి అయితే లేదు. కానీ టీడీపీ బస్తీ మే సవాల్ అంటోంది. 

కానీ గ్రౌడ్ లెవెల్ లో మాత్రం సీన్ వేరేగా ఉందని అంటున్నారు. వరసపెట్టి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించినా టీడీపీకి పోటీకి గట్టి అభ్యర్ధులు దొరకదం కష్టమే అన్న మాట అయితే ఉందిపుడు.

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?

అయ‌న లాంచ్ చేశారు..హిట్టయింది