బాబుని మానసికంగా హింసిస్తున్న జగన్

'కమాన్.. హిట్ మి హార్డ్ యార్..' ఓ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఇది. కెలికి కొట్టించుకోవడానికి పరాకాష్ట ఆ సన్నివేశం. సరిగ్గా ఇలాంటి సీన్ ఏపీ పాలిటిక్స్ లో కూడా రిపీట్ అవుతోంది. ఇప్పుడు…

'కమాన్.. హిట్ మి హార్డ్ యార్..' ఓ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఇది. కెలికి కొట్టించుకోవడానికి పరాకాష్ట ఆ సన్నివేశం. సరిగ్గా ఇలాంటి సీన్ ఏపీ పాలిటిక్స్ లో కూడా రిపీట్ అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి సేమ్ టు సేమ్ అలాగే ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా కూడా బాబు పరిస్థితిలో మార్పు లేదు. 

పంచాయతీ పోరుని అడ్డం పెట్టుకుని జగన్ చేతిలో మరో దెబ్బ తినడానికి వేచి చూస్తున్నారు. అయితే అక్కడ మహేష్ బాబు లాగే ఇక్కడ జగన్ మొహమాటపడుతున్నారు. పంచాయతీ ఎన్నికలపై అసలు జగన్ మాట్లాడటం లేదు, వాటిని పట్టించుకోనట్టే ఉన్నారు. దీంతో చంద్రబాబు రెచ్చిపోతున్నారు. 

భయమా, గౌరవమా, భక్తా అంటూ డైలాగులు కొడుతున్నారు. అయితే యథావిధిగా జగన్ మౌనంగా ఉండటంతో బాబులో ఫ్రస్టేషన్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

రెండు రోజులుగా చంద్రబాబు ప్రసంగాలు వింటే.. ఆయనలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. మాటలు మారాయి, హావభావాలు పూర్తిగా మారాయి, మంచి, మర్యాద కనుమరుగయ్యాయి. ఒకప్పుడు చంద్రబాబు ఎంత సుత్తి కొట్టినా పరుష పదాలు దొర్లేవి కావు, కానీ ఇప్పుడు సుత్తి కొట్టడంతో పాటు, ఫ్రస్టేషన్ పీక్స్ కెళ్లిపోయి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

మేనిఫెస్టో విడుదల కోసం పెట్టిన మీడియా సమావేశంలో జగన్ పై వ్యక్తిగత నిందలు వేయడం ఎంతవరకు సమంజసం. మీ బాబాయ్ హత్యకేసులో ఇంతవరకు హంతకుల్ని పట్టుకునే దిక్కులేదు, నువ్వేమైనా పోటుగాడివా, పీకుతావా అంటూ బాబు రెచ్చిపోయారు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎప్పుడూ ఇంత ఫ్రస్టేషన్ కి గురైన దాఖలాలు లేవు.

బాబుని మానసికంగా హింసిస్తున్న జగన్..

చంద్రబాబు మానసిక దుస్థితికి కారణం జగనే. అవును, ఆయన మౌనం ఈయన ఆవేశానికి కారణం అవుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి జగన్ మౌనాన్ని ఆశ్రయించారు, అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టారు. 

ఈ దశలో చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. పంచాయతీ పోరుపై జగన్ మాట్లాడకపోవడంతో బాబులో అసహనం పెరిగిపోతోంది.

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అది గెలుపు కోసం కాదు, గొడవల కోసం. ఎన్నికలు జరిగితే గొడవలు సృష్టించి, అధికార పార్టీపై నిందలు వేసి, కాలం గడపాలనేది బాబు మాస్టర్ ప్లాన్. రాష్ట్రం నిత్యం రావణ కాష్టంలా ఉంటే.. ఆందోళనలు, నిరసనలతో ఎన్నికల వరకు పార్టీ శ్రేణుల్ని బిజీగా ఉంచాలనేది ఆయన ఆలోచన.

అయితే జగన్ ఈ ఎన్నికల్ని పూర్తిగా లైట్ తీసుకున్నారు. వైసీపీ నేతలు కూడా ఏకగ్రీవాలకోసం మంతనాలు సాగిస్తున్నారే కానీ, పోటీ, ప్రచారం అన్న విషయాలను పట్టించుకోవడంలేదు. అంటే రాష్ట్రంలో గొడవలు జరిగే అవకాశమే లేదని అర్థమైంది. 

దీంతో చంద్రబాబులో అసహనం-నైరాశ్యం నిండుకొంది. ఏదో ఒకటి చేసి పంచాయతీ ఎన్నికల్లో పెద్ద సీన్ క్రియేట్ చేయాలనే తన ప్లాన్ వర్కవుట్ కాదని తెలిసిన బాబు.. జగన్ పై ఇలా వ్యక్తిగత దాడికి దిగుతున్నారు.

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?

అయ‌న లాంచ్ చేశారు..హిట్టయింది