స్టార్ హీరోకు యాక్సిడెంట్, ఈ రోజే సర్జరీ

మలయాళ స్టార్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లో గాయపడ్డాడు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. Advertisement ప్రస్తుతం ఈ హీరో విలాయత్ బుద్ధ అనే…

మలయాళ స్టార్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లో గాయపడ్డాడు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ప్రస్తుతం ఈ హీరో విలాయత్ బుద్ధ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తీస్తున్న యాక్షన్ సీన్ లో భాగంగా బస్సుపై నుంచి జారిపడ్డాడు పృధ్వీరాజ్. అతడి కాలికి చిన్న గాయమైంది.

గాయం చిన్నదే అయినప్పటికీ సర్జరీ తప్పనిసరి అని వైద్యులు సూచించడంతో, మరికొద్దిసేపట్లో పృధ్వీరాజ్ కు ఆపరేషన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత కనీసం 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవడం అనివార్యమని వైద్యులు తెలిపారు.

సచి దర్శకత్వంలో విలాయత్ బుద్ధాని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సచి అకాల మరణం చెందారు. దీంతో ఆ సినిమా బాధ్యతలు జయన్ నంబియార్ చేతిలో పెట్టారు. షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తవుతుందనగా, పృధ్వీరాజ్ గాయపడ్డాడు. ఇలా ఆది నుంచి ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి

మరోవైపు పృధ్వీరాజ్ గాయంతో, అతడు నటిస్తున్న సినిమాల షూటింగ్స్ ఆన్నీ ఆగిపోయాయి. మరీ ముఖ్యంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాపై ఆ ప్రభావం పడనుంది. ఈ సినిమాలో పృధ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.