అయ్యో …ఉమా

మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దేవినేని ఉమామ‌మేశ్వ‌ర‌రావు పేరు వింటే , ఆ పార్టీ నేత‌లు ముందూ వెనుకా చూసుకోకుండానే ప‌రుగు తీసే ప‌రిస్థితి. దీన్ని బ‌ట్టి ఆయ‌న మాన‌సిక స్థితిపై…

మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దేవినేని ఉమామ‌మేశ్వ‌ర‌రావు పేరు వింటే , ఆ పార్టీ నేత‌లు ముందూ వెనుకా చూసుకోకుండానే ప‌రుగు తీసే ప‌రిస్థితి. దీన్ని బ‌ట్టి ఆయ‌న మాన‌సిక స్థితిపై సొంత పార్టీలో ఎలాంటి అభిప్రాయాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌ని …టీడీపీ శ్రేణులే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. 

బాబు హ‌యాంలో కీల‌క‌మైన జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఉమ‌మ‌హేశ్వ‌ర‌రావు… గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నుంచి వసంత కృష్ణ‌ప్ర‌సాద్ చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యాడు. రాజ‌కీయాల్లో జ‌యాప‌జ‌యాలు స‌ర్వ‌సాధార‌ణ‌మే అయినా …దేవినేని ప‌రిస్థితి కొంచెం భిన్న‌మ‌నే చెప్పాలి. 

అధికారం శాశ్వ‌త‌మ‌నే భ్ర‌మలో ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుల‌పై నోరు పారేసుకున్నాడు. అసెంబ్లీలో పోల‌వ‌రంపై చ‌ర్చ‌లో భాగంగా …నీ సాక్షి ప‌త్రిక‌లో రాసి పెట్టుకో జ‌గ‌న్‌రెడ్డి , 2018 నాటికి ప్రాజెక్ట్ పూర్త‌వుతుందని ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడు.

అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్ప‌టికీ పూర్తి కాని విష‌యం తెలిసిందే. జ‌గ‌న్‌పై అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట దూష‌ణ‌ల‌కు దిగిన టీడీపీ నేత‌ల్లో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా మొద‌టి వ‌రుస‌లో ఉన్నారు. అధికారం పోయిన త‌ర్వాత వారికి అధికార పార్టీ నేత‌లు సినిమా చూపిస్తున్నారు. అందుకే వీళ్ల విష‌యంలో ప్ర‌జ‌ల నుంచి క‌నీస సానుభూతి కూడా రాక‌పోగా, చేసుకున్న వాళ్ల‌కు చేసుకున్నంత మ‌హ‌దేవ‌ అనే మాట‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అంటే సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని కృష్ణా జిల్లాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న వెంట ప్రెస్‌మీట్ల‌కు వెళ్లాలంటే గుండెను అర‌చేతిలో పెట్టుకోవాల్సి వ‌స్తోంద‌ని నాయ‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. నిన్న‌టి ప్రెస్‌మీట్‌లో ఉమా మాట‌లు తీరు చూస్తే …ఎవ‌రికైనా ఆయ‌న మానసిక స్థితిపై సందేహాలు క‌ల‌గ‌క‌మాన‌వు.

పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక అసెంబ్లీని ర‌ద్దు చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లుస్తాన‌ని , రాజీనామా చేస్తాన‌ని, ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌గ‌ల్భాలు ప‌లికార‌ని, ఆ త‌ర్వాత ఎందుకు త‌గ్గార‌ని  దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప్ర‌శ్నించాడు.  

నిఘా, ప్ర‌త్యేక బృందాల ద్వారా తెప్పించుకున్న ప్ర‌జాభిప్రాయం వ్య‌తిరేకంగా ఉండ‌డంతో 4 గంటల్లోనే సీఎం మాట మార్చార‌న్నారు.  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చే వ‌ర‌కూ తాడేప‌ల్లి రాజ‌ప్రాసాదంలో ఏం జ‌రిగింద‌ని ఆయ‌న‌ ప్ర‌శ్నించాడు.

ప్ర‌త్య‌ర్థుల‌పై  దేవినేని ఆరోప‌ణ‌లు విన్న తర్వాత ….”మా వాడిలో ఏదో తేడా కొడుతోంది. మామూలు మ‌నుషులెవ‌రూ ఇలా మాట్లాడ‌రు” అనే అభిప్రాయాలు టీడీపీ నేత‌లు ఆఫ్ ది రికార్డుగా మీడియా మిత్రుల‌తో అంటుండ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ పాల‌న మ‌రో మూడేళ్లకు పైగా సాగ‌నుందని, మున్ముందు దేవినేనిలో మ‌రెన్ని విపరీత‌పోక‌డ‌లు చూడాల్సి వ‌స్తుందోన‌నే భ‌యం టీడీపీ నేత‌ల్లో నెల‌కుంది.

దేవినేని వెంట ప్రెస్‌మీట్‌కు వెళితే త‌మ‌నెక్క‌డ ఆయ‌నతో జ‌త క‌డుతారోన‌ని టీడీపీ నేత‌ల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. అయ్యో …ఉమా అని జాలిప‌డ‌డం త‌ప్ప ఎవ‌రైనా ఏం చేయ‌గ‌ల‌రు?

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?

అయ‌న లాంచ్ చేశారు..హిట్టయింది