పాపం..సీనియర్ నిర్మాత. హరి హర వీరమల్లు సినిమా ను ఫినిష్ చేయించడానికి ఎంత కిందా మీదా పడుతున్నారో? వినాయకుడి పెళ్లికి వేయి విఘ్నాలు అన్నట్లు వుంది వ్యవహారం.
ఏనాడో ప్రారంభమైన సినిమా. రకరకాల కారణాలు వినిపిస్తూ వున్నాయి. సినిమా వెనక్కు జరుగుతూ వుంది. ఆఖరికి ఈనెల కాస్త గ్యాప్ లు (రాజకీయాల కోసం) మినహా మొత్తం ఆ సినిమా కోసం కేటాయించారు పవన్ కళ్యాణ్.
ఈరోజు షూటింగ్ అని వార్తలు వినిపించాయి. సెట్ రెడీ అయింది. కానీ షూటింగ్ మాత్రం మళ్లీ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది జస్ట్ వన్ డే కు వాయిదా పడిందా లేక, మరి కొన్ని రోజులా అన్నది క్లారిటీ రావాల్సి వుంది.
నిర్మాత రత్నం సంగతి అలా వుంచితే దర్శకుడు క్రిష్ ఈ సినిమాను నమ్ముకుని వున్నారు. ఇది విడుదలై ఆయనకు మళ్లీ మంచి పేరు రావాల్సివుంది. కానీ ఆ రోజు ఎప్పటికి వస్తుందన్నదే క్లారిటీ లేదు.
ఎవరి సినిమా షెడ్యూలు అయినా చటుక్కున చెప్పవచ్చు కానీ పవన్ సినిమా మాత్రం కాదు. ఆయన వస్తే వచ్చినట్లు.. లేదంటే లేనట్లు. పీపుల్స్ మీడియా నిర్మించే సినిమాలో సాయి ధరమ్ హీరో. సినిమా స్టార్ట్ కావడానికి వారం ముందు కన్నా అడ్వాన్స్ గా చెప్పలేమన్నారట నిర్మాతలు. పవన్ తో సినిమా అంటే అలా వుంటుంది మరి.