పవన్ కల్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా

ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో 4 సినిమాలున్నాయి. వీటికి అదనంగా మరో 2 సినిమాలు ప్రకటించే ప్లానింగ్ లో కూడా ఉన్నాడు ఈ హీరో. మరి వీటిలో కాస్ట్ లీ మూవీ ఏది? ఈ…

ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో 4 సినిమాలున్నాయి. వీటికి అదనంగా మరో 2 సినిమాలు ప్రకటించే ప్లానింగ్ లో కూడా ఉన్నాడు ఈ హీరో. మరి వీటిలో కాస్ట్ లీ మూవీ ఏది? ఈ సినిమాల్లోనే కాదు, పవన్ కెరీర్ లోనే కాస్ట్ లీ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అదే క్రిష్ మూవీ.

అవును.. పవన్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుకున్న సినిమానే అతడి కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీ. ఈ మూవీ కోసం నిర్మాత ఏఎం రత్నం అటుఇటుగా 170 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు.

ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడు పవన్ కల్యాణ్. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు. ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ వేశారు. ప్రస్తుతం చార్మినార్ సెట్ వేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో మరో దర్బార్ సెట్ వేస్తున్నారు.

దీంతో పాటు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. వీటికి తోడు గ్రాఫిక్స్ సరేసరి. సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువ స్కోప్ ఉంది. ఇంకా చెప్పాలంటే పవన్ కల్యాణ్ సినిమాల్లో ఇదొక గ్రాఫిక్ వండర్ అంటున్నారు మేకర్స్.

ప్రాధమికంగా ఈ సినిమా కోసం 100 నుంచి 120 కోట్ల రూపాయలు అనుకున్నాడు నిర్మాత. కట్ చేస్తే, ఇప్పుడీ బడ్జెట్ మరో 50 కోట్ల రూపాయలు పెరిగిందని చెబుతున్నాడు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను తీసుకున్నారు. 

జ‌గ‌న్ పార్టీ ఉనికిని కాపాడింది ష‌ర్మిలే

గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌