రవితేజ నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. ఆ మధ్యన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.
ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించేసారు. దసరా సందర్భంగా బరిలోకి వస్తోందీ సినిమా. ప్రోగ్రెస్ వరకు చూసుకుంటే సినిమా టాకీ షూట్ మొత్తం అయిపోయింది. రెండు పాటలు మాత్రం చిత్రీకరించాల్సి వుంది. వాటిని వచ్చే నెలలో చిత్రీకరిస్తారు.
ప్రస్తుతం టీజర్ కట్ వర్క్ జరుగుతోంది. ఫస్ట్ వీక్ లో టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వరుస ఫ్లాపులతో వున్న రవితేజ ఈ సినిమా మీద ఫుల్ హోప్ తో వున్నాడు. చాలా పకడ్బందీ స్క్రిప్ట్ తో, భారీ ఖర్చుతో తెరకెక్కిందీ సినిమా. ఈ సినిమా కోసం ఓ ట్రయిన్, ట్రయిన్ ట్రాక్ సెట్ నే వేసారు ఏకంగా. ఈ సెట్ లో ఓ రాబరీ సీన్ ను తెరకెక్కించారు.
70-80 దశకం నాటి స్టూవర్ట్ పురం సెటిల్ మెంట్ గ్యాంగ్ లు, దొంగల వ్యవహారాల మీద అనేక కథలు వున్నాయి. వాటిలో ఆసక్తికరమనది టైగర్ నాగేశ్వరరావు కథ. అదే ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాక అభిషేక్ అగర్వాల్ నిర్మాత.