ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఏమౌతుంది?

పండ్లు, కూరగాయలు శరీరానికి మంచిదనే సంగతి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వివిధ రకాలు పండ్లతో చాలా ఉపయోగాలున్నాయి. అయితే ఈ పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఖాళీ…

పండ్లు, కూరగాయలు శరీరానికి మంచిదనే సంగతి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వివిధ రకాలు పండ్లతో చాలా ఉపయోగాలున్నాయి. అయితే ఈ పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ తింటే.. ఉపయోగాల కంటే అనర్థాలే ఎక్కువని చెబుతున్నారు.

ఉదాహరణకు మామిడి పండునే తీసుకుందాం. ఖాళీ కడుపుతో ఈ పండు తింటే శరీరానికి మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

మామిడిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఇవి తింటే శరీరంలో ఒక్కసారిగా షుగర్ శాతం పెరిగిపోతుంది. అంతేకాదు.. కిడ్నీలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. ఖాళీ పొట్టతో మామిడి తింటే షుగర్ బారిన పడే ప్రమాదం ఎక్కువనే విషయం ఇప్పటికే నిర్థారణ అయింది.

కేవలం మామిడి మాత్రమే కాదు.. ద్రాక్ష, ఖర్జూరం లాంటి ఫలాల్ని కూడా పరగడుపున (ఖాళీ కడుపుతో) తినకూడదు. పుల్లగా ఉండే ద్రాక్ష, నారింజ, ఉసిరి లాంటివి ఖాళీ పొట్టలోకి చేరితే ఎసిడిటీకి కారణం అవుతాయి. దీని వల్ల అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువవుతాయి.

ఇక ఖాళీ కడుపుతో ఖర్జూరం, అరటి లాంటి పండ్లు తింటే.. ఇందులో ఉండే మెగ్నీషియం నేరుగా గుండెకు చేటు చేస్తుంది. కాబట్టి ఖాళీ కడుపుతో ఎలాంటి పండ్లు తినకూడదనేది అందరూ చెప్పే మాట.

రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేసేవాళ్లు తక్షణ శక్తి కోసం పొద్దున్నే అరటిపండు తింటుంటారు. అప్పటికే మంచి నీళ్లు తాగడం వల్ల ఇబ్బంది ఉండదని భావిస్తుంటారు. కానీ అరటిపండుతో పాటు ఏ ఫలాన్నైనా.. ఘనాహారం తిన్న తర్వాతే తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?