భీమ్లా నాయక్ సినిమా కు డీవోపీ గా పని చేసారు రవి కే చంద్రన్. ఇప్పుడు మళ్లీ ఆయననే రిపీట్ చేస్తున్నారు మరో సినిమాకు హీరో పవన్ కళ్యాణ్.
తమిళ సినిమాను సముద్రఖని డైరక్షన్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమాకు స్క్రిప్ట్, మాటలు దర్శకుడు త్రివిక్రమ్ అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ మెయిన్ హీరో. పవన్ ప్రత్యేక పాత్ర.
ఈ సినిమాకు ఏస్ డీవోపీ కావాలని ముందే తెరవెనుక సూత్రధారి త్రివిక్రమ్ కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు రవి కే చంద్రన్ పేరు ఫిక్స్ అయింది. రవి..సముద్రఖని కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసారు. ఇద్దరం కలిసి కొత్త ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ చేసామని అనౌన్స్ చేసారు.
ఇదిలా వుంటే ఈ సినిమాలో సాయి ధరమ్ సరసన హీరోయిన్ వేట కొనసాగుతోంది. కృతి శెట్టి ఫస్ట్ చాయిస్ గా వుంది. ఈనెల అంతా హరి హర వీరమల్లు సినిమా మీద వర్క్ చేసిన తరువాత పవన్ కొత్త సినిమా మీదకు వస్తారు.
ఆ తరువాత హరీష్ శంకర్ సినిమా సంగతి. ఈలోగా మరో సినిమా అడ్డం పడకపోతే. వైష్ణవ్ తేజ్-త్రివిక్రమ్ (స్క్రిప్ట్) సినిమా వుండనే వుంది. పైగా ఆలోగానే దర్శకుడు హరీష్ కథ చెప్పి పవన్ ను ఒప్పించాల్సి వుంది.