నాడు ఎన్టీయార్.. నేడు జగన్…

దేశంలో పాలనాపరమైన సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నారు అని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు కొనియాడారు. జగన్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని ఏపీలో…

దేశంలో పాలనాపరమైన సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరినీ ఆదర్శంగా నిలుస్తున్నారు అని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు కొనియాడారు. జగన్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని ఏపీలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరుగా మార్చారని పేర్కొన్నారు.

నాడు ఎన్టీయార్ మండల వ్యవస్థతో ఉమ్మడి ఏపీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చారని, నేడు జగన్ ఆయన కంటే మరో రెండు అడుగులు ముందుకేసి ఏకంగా పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్ళారని చెప్పారు. 

ఇక చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేయడం మంచి నిర్ణయం అని అన్నారు. దీని వల్ల పాలన ప్రజలకు చేరువ అవుతుందని, కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు ప్రజలకు దగ్గరగా ఉంటూ అనేక సమస్యలను పరిష్కరించగలరని దాడి అభిప్రాయపడ్డారు.

జగన్ తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ, సచివాలయాల వ్యవస్థను కర్నాటక తదితర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని దాడి వీరభద్రరావు గుర్తు చేశారు. మొత్తానికి ఆయన చెప్పేది ఏంటంటే 43 ఏళ్లుగా అతి పెద్ద జిల్లాలతో సతమతమవుతున్న ఏపీ రూపు రేఖలను మార్చి నూతన భవిష్యత్తుని జగన్ ఇచ్చాడని. ఈ సీనియర్ మోస్ట్ నేత కితాబు అటు విపక్షాలు తగిన జవాబుగా ఇటు వైసీపీకి గొప్ప ప్రశంసగా కూడా చూడాలి.