ఈ అమ్మాయి అదృష్టం అనుకోవాలో?..ఆ అమ్మాయి బ్యాడ్ లక్ అనుకోవాలో..? నిన్నటికి నిన్న ఓ పబ్ పై జరిగిన రైడ్ లో పలువురు పెద్దల పిల్లలు పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి రావడం తెలిసిన సంగతే. అయితే ఈ అప్రతిష్ట ప్రమాదం నుంచి ఓ పెద్ద హీరో కుమార్తె తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
రైడ్ జరగడానికి అరగంట ముందు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆమె తప్పించుకోగలిగారు. లేదూ అంటే ఆమె కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తే ఆ హీరో పరిస్థితి దారుణంగా వుండి వుండేదని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
నిజానికి ఈ హీరో కుమార్తె తన కజిన్ తో కలిసి వెళ్లిందని, అయితే అర్జెంట్ కాల్ రావడంతో కాస్త ముందుగా వెళ్లిపోవాల్సి వచ్చిందని గ్యాసిప్ వినిపిస్తోంది. ఈ పబ్ కు వెళ్లడం అన్నది వీళ్లకు కామన్ అని, దానికి కారణం ఒక్కటే అని. లేట్ నైట్ తెరచి వుంచే పబ్ అది కావడం అన్నది తప్ప మరో రీజన్ లేదని అంటున్నారు.
పబ్ యజమానులకు రాజకీయ సంబంధాలు వుండడంతో ఇలా మేనేజ్ చేసుకుంటూ వచ్చారని, ఇప్పుడు పోలీస్ ఫై అధికారులు మారడంతో వ్యవహారం తల్లకిందులైందని టాక్. మొత్తం మీద టాలీవుడ్ లో ఈ వ్యవహారం మరోసారి సంచలనం సృష్టించింది.