చంద్రబాబు చేతగాని డైలాగులు

జిల్లాల విభజన తాను చేయలేకపోయారు.. జగన్ చేశారు. అయితే తను అధికారంలోకి వచ్చాక దాన్ని సరిదిద్దుతారట చంద్రబాబు. Advertisement మద్య నిషేధం తాను చేయలేకపోయారు, జగన్ చేస్తానంటున్నారు. కానీ తానొచ్చాక మద్యం పాలసీ మారుస్తారట…

జిల్లాల విభజన తాను చేయలేకపోయారు.. జగన్ చేశారు. అయితే తను అధికారంలోకి వచ్చాక దాన్ని సరిదిద్దుతారట చంద్రబాబు.

మద్య నిషేధం తాను చేయలేకపోయారు, జగన్ చేస్తానంటున్నారు. కానీ తానొచ్చాక మద్యం పాలసీ మారుస్తారట బాబు.

పోలవరం తాను కట్టలేదు, జగన్ తంటాలు పడుతున్నారు, ఎందుకింత ఆలస్యం అంటున్నారు బాబు.

రాజధాని నిర్మాణం తన హయాంలో చేయలేకపోయారు, జగన్ మాత్రం తొందరగా చేయాలని పట్టుబడుతున్నారు బాబు.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తాను చేయలేకపోయినవన్నీ, జగన్ ఎందుకు పూర్తి చేయట్లేదనేది బాబు డైలాగ్. తాజాగా జిల్లాల విభజన తర్వాత కూడా సహజరీతిలో విషం చిమ్మారు. జిల్లాల విభజన అసమగ్రంగా ఉందంటూ పవన్ కల్యాణ్ పసలేని వాదన చేస్తే, చంద్రబాబు కూడా అదే పల్లవి అందుకున్నారు.

ఏపీలో జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని అంటున్నారు. రాజకీయ కోణంలో జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ సరిదిద్దుతామంటున్నారు. అసలు అక్కడ సమస్యలూ లేవు, బాబు అధికారంలోకి వచ్చే సమస్యా లేదు. ఇక ఎందుకీ దిద్దుబాట్లు. గ్రహబాట్లు, చంద్రపాట్లు.

ఇంటింటికీ వెళ్తే తరిమేస్తారేమో..?

ఇటీవలే వైసీఎల్పీ మీటింగ్ లో సీఎం జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లాలని చెప్పారు. ఇప్పుడిదేమాట చంద్రబాబు కూడా చెబుతున్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలంటున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని చెప్పుకునే అవకాశముంది, మరి టీడీపీ వాళ్లు ఏం చెబుతారు. అసలు ప్రతిపక్షంలో ఉండి తామేం చేశారో చెప్పుకుంటారా లేక, అధికారంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయామని బాధపడతారా..?

ఇప్పటికీ చంద్రబాబు తన తప్పు తెలుసుకోలేదు. జగన్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో పరోక్షంగా తన తప్పుల్ని తానే చెప్పుకుంటున్నారు. 

ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు, కరోనా లాంటి కష్టలేవీ లేనప్పుడు, అంతర్జాతీయంగా అన్ని రేట్లు అదుపులోనే ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయానని తన తప్పుల్ని తానే ఒప్పుకుంటున్నారు. జగన్ దిగిపోతే అన్నీ సరిచేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.