పవన్ లేకుండానే ఓజి చకచకా

పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ఓజి. ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ చేయాల్సిన దాని కన్నా, ఆయన లేకుండా చేయాల్సిందే ఎక్కువ. అందుకే హీరోతో సంబంధం లేకుండా…

పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ఓజి. ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ చేయాల్సిన దాని కన్నా, ఆయన లేకుండా చేయాల్సిందే ఎక్కువ. అందుకే హీరోతో సంబంధం లేకుండా షూటింగ్ చకచకా సాగిపోతోంది. 

ఈ నెల 24తో లేటెస్ట్ షెడ్యూలు ముగుస్తుంది. మళ్లీ జూలై 9 నుంచి కొత్త షెడ్యూలు ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి జూలై నెలంతా చిన్న చిన్న గ్యాప్ లు మినహా షూట్ వుంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు షూట్ లో జాయిన్ అవుతారు అన్నది మాత్రం ఆయనకే తెలిసిన సంగతి. 

ఆయన తాను వస్తానని చెప్పాలి. అప్పుడు అరేంజ్ మెంట్స్ చేసుకోవాల్సి వుంటుంది. అయితే అది కూడా ఆంధ్రలోనా, హైదరాబాద్ లోనా అన్నది ఇప్పటికి ఇంకా నిర్ణయం కాలేదని తెలుస్తోంది. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల చేయాల్సి వుంది. ఈ సినిమాకు సిజి వర్క్ కూడా కాస్త ఎక్కువే. అందువల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనికి ఎక్కువ సమయం పడుతుంది.

ఇదిలా వుంటే క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు, మైత్రీ నిర్మిస్తున్న ఉస్తాద్ సినిమాలు కూడా పవన్ చేయాల్సి వుంది. గత నెలలోనే మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ కూడా వేసారు. కానీ అప్పటి నుంచి ఒక్క రోజు కూడా షూట్ జరగలేదు. ఈ సినిమా మీద ఫ్యాన్స్ చాలా హోప్ తో వున్నారు. ఎన్నికలలోగా ఈ సినిమా పూర్తి అవుతుందనే అనుకుంటున్నారు.