లవ్ స్టోరీ-టక్ జగదీష్-ఏం జరిగింది?

టాలీవుడ్ లో మళ్లీ సినిమాల క్లాష్ స్టార్ట్ అయింది. శేఖర్ కమ్ముల-చైతన్య ల లవ్ స్టోరీ ఏప్రిల్ 16కు డేట్ అనౌన్స్ చేసింది. కానీ అప్పటికే నాని-శివనిర్వాణల టక్ జగదీష్ అదే డేట్ కు…

టాలీవుడ్ లో మళ్లీ సినిమాల క్లాష్ స్టార్ట్ అయింది. శేఖర్ కమ్ముల-చైతన్య ల లవ్ స్టోరీ ఏప్రిల్ 16కు డేట్ అనౌన్స్ చేసింది. కానీ అప్పటికే నాని-శివనిర్వాణల టక్ జగదీష్ అదే డేట్ కు వస్తామని ప్రకటించి వుంది. దీంతో రకరకాల డిస్కషన్లు ప్రొడ్యూసర్ల సర్కిల్ లో, డిస్ట్రిబ్యూటర్ల సర్కిళ్లలో ప్రారంభమయ్యాయి.

మామూలుగా అయితే వ్యవహారం ఎలా వుండేదో కానీ, ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాజీ భాగస్వామి లక్ష్మణ్ టక్ జగదీష్ సినిమాను తెలుగు రాష్ట్రాలకు అవుట్ రేట్ కు 22 కోట్లకు కొనుగోలు చేయడం అన్నది ఇక్కడ కీలకపాయింట్ అయింది.

నిజానికి లవ్ స్టోరీ సినిమాను నిర్మాత సునీల్ ఏప్రిల్ 9న విడుదల చేయాలని అనుకున్నారని తెలుస్తోంది. కానీ వకీల్ సాబ్ ను ఆ డేట్ కు తేవాలనుకుంటున్నారు దిల్ రాజు. పోనీ ఓ వారం ముందు ఏప్రిల్ 2న వేద్దాం అనుకుంటే మార్చి 26న దిల్ రాజు నైజాం ఏరియాకు కొన్న రంగ్ దే వుంది.

అందువల్ల ఏప్రిల్ 16 డేట్ వేసుకోమని సునీల్ కు దిల్ రాజే సలహా ఇచ్చారని బోగట్టా. టక్ జగదీష్ ను ఓ వారం వెనక్క వెళ్లేలా తానే చూస్తానని ఆయనే సునీల్ కు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ఇద్దరు ముగ్గురు గిల్డ్ సభ్యులు కూడా సాక్ష్యంగా వున్నారని టాక్.

ఆ భరోసాతో సునీల్ ఏప్రిల్ 16కు డేట్ ఇచ్చారు. ఇప్పుడు టక్ జగదీష్ వెనక్కు వెళ్లాలి అంటే నిర్మాత, హోల్ సేల్ బయ్యర్ అనుకుంటే సరిపోదు. హీరో నాని కూడా ఓకె అనాలి.  మరి నాని ఏమంటారో చూడాలి. మరీ అందరూ పట్టుపడితే తాను మళ్లీ ఏప్రిల్ 2 లేదా 9కి వెళ్లిపోవడానికి రెడీ అని సునీల్ అంటున్నట్లు తెలుస్తోంది. అలా అయితే మళ్లీ దిల్ రాజు ఇబ్బందుల్లో పడతారు. 

ఇదిలా వుంటే మార్చి 11 డేట్ వ్యవహారం కూడా కాస్త వివాదాస్పదం అవుతోందని తెలుస్తోంది. జాతిరత్నాలు, శ్రీకారం సినిమాలు వుండగా గాలిసంపత్ డేట్ ప్రకటించారు. రెండు సినిమాలు వుండగా, మూడో సినిమా వేయకూడదని నిర్మాతల గిల్డ్ లో ఓ నియమం పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో లాటరీ తీసుకోవాలని కూడా అనుకున్నారని బోగట్టా. 

ఇక్కడ కూడా జాతిరత్నాలు సినిమాతో దిల్ రాజు మాజీ భాగస్వామి లక్ష్మణ్ తొలిసారిగా డిస్ట్రిబ్యూటర్ గా విశాఖలో అడుగుపెడుతున్నారు. శ్రీకారం సినిమాను దిల్ రాజును ఇటీవల బాహాటంగా విమర్శించిన వరంగల్ శ్రీను నైజాంలో విడుదల చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను ఈ కోణంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు.

జాతిరత్నాలు నిర్మాత స్వప్నదత్ ఈమేరకు గిల్డ్ పెద్దలను నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండు సినిమాలు వుండగా మూడో సినిమా ఎలా ప్రకటించారని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గిల్డ్ కు కూడా దిల్ రాజు సారథ్యం వహిస్తుండడం, ఆయన సినిమాలు కూడా విడుదల ప్లాన్ లో వుండడం, ఆయన మాజీ భాగస్వాములు లేదా ఆయనతో ఢీ అంటున్నవారి సినిమాలు కూడా ఆ డేట్ ల్లోనే వుండడంతో, మొత్తం ఈ వ్యవహారం అంతా ఆయన పేరు చుట్టూనే తిరుగుతోంది. 

కరోనా అనంతరం ఈ తరహా సీన్ కొన్నాళ్ల పాటు తప్పేలా లేదు. ఎందుకంటే  పెద్ద సంఖ్యలో సినిమాలు రెడీ అయిపోవడం, సమ్మర్ లోగా ఇవన్నీ విడుదల కావాల్సి వుండడంతో ఓవర్ లాప్ తప్పదు, ఆ క్రమంలో వేరే వేరే అంశాలు ముడిపడి, గిల్డ్ లో లుకలుకలు తప్పకపోవచ్చు. 

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?