బీస్ట్ ట్రయిలర్..నాట్ అప్ టు ది మార్క్

తమిళ సూపర్ స్టార్ విజయ్ లేటెస్ట్ సెన్సేషన్ బీస్ట్ ట్రయిలర్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పాట సూపర్ డూపర్ హిటై సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. దాంతో…

తమిళ సూపర్ స్టార్ విజయ్ లేటెస్ట్ సెన్సేషన్ బీస్ట్ ట్రయిలర్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పాట సూపర్ డూపర్ హిటై సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. దాంతో ట్రయిలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ ట్రయిలర్ మాత్రం అప్ టు ది మార్క్ లేదు. టెక్నికల్ గా బాగుంది కానీ ఎక్కడో ఏదో వెలితి అనిపిస్తోంది ట్రయిలర్. 

సెటిల్డ్ గా, స్టయిలిష్ గా థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ను డీల్ చేయాలని చూసినట్లు కనిపిస్తోంది. దాని వల్ల ట్రయిలర్ చూస్తుంటే కిక్ రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ నటన కూడా కాస్త స్టయిలిష్ గా కొత్తగా వుండాలని ట్రయ్ చేసినట్లు కనిపిస్తోంది. కానీ అది మన ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా వుందా అన్నది అనుమానం.

సినిమా టేకింగ్, విజయ్ యాక్టింగ్, అనిరుధ్ ఆర్ఆర్ ఇలా అన్నీ కొత్తగా, స్టయిలిష్ గా వుండాలని ట్రయ్ చేసినట్లున్నారు. కానీ అన్నీ ఒకేసారి ట్రయ్ చేయడంతో పాటు, ట్రయిలర్ లో మెయిన్ స్టోరీని, హీరోయిన్ ఎపిసోడ్ ను పక్కన పెట్టారు. దాంతో ట్రయిలర్ పక్కా ఓ సెట్ కు మాత్రమే ఫిక్స్ అయినట్లు వచ్చింది.  

సినిమా వచ్చాక ఎలా వుంటుందో చూడాలి. కేజిఎఫ్ 2 తో పాటుగా విడుదలవుతున్న బీస్ట్, ట్రయిలర్ విషయంలో మాత్రం ఆ సినిమాకు వెనుకే మిగిలింది.