యంగ్ హీరో సుధాకర్ కోమాకుల నటించిన సినిమా నారాయణ అండ్ కో.ఈ ట్రయిలర్ ను విడుదల చేసారు. లైన్ ఏమీ కొత్తగా లేదు కానీ ఫన్ పండించడానికి వీలయిన లైన్ నే ఇది. పైగా సక్సెస్ ఫుల్ పార్ములాగా ప్రూవ్ చేసుకున్న లైన్.
బ్యాంక్ క్యాషియర్ నారాయణ అండ్ ఫ్యామిలీ మధ్య నడిచే ఎంటర్ టైన్ మెంట్ డ్రామా ఇది. విదేశాల నుంచి వచ్చిన ఓ పిల్లి బొమ్మ చుట్టూ తిరుగుతుంది ఈ ఎంటర్ టైన్ మెంట్ కథ.
ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కథ కాస్తా ఈ పిల్లి బొమ్మ చుట్టూ చేరి, కామెడీ థ్రిల్లర్ గా మారుతుంది. ఈ సినిమాకు దర్శకుడు చిన్న పాపిశెట్టి. ‘మనం ఏమన్నా విహార యాత్రకు వచ్చామా..మంచినీళ్లు, పులిహోల పొట్లాలు తీసుకురావడానికి’ అనే ఫన్ నోట్ చూస్తేనే అర్థం అవుతుంది, సినిమాను ఏ దిశగా నడిపించారో తెలియడానికి. నారాయణగా దేవీశ్రీప్రసాద్, అతని భార్యగా ఆమని నటించారు.
దర్శకుడు, హీరో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాజీవ్ మాటలు అందించారు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.