మార్గదర్శి భజనలో మరీ ఇంత వక్రీకరణలా?

తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ సహా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ తరఫున వకాలత్తు పుచ్చుకున్నారు. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట.. మార్గదర్శి సంస్థను సీఐడీ వేధిస్తున్నదని, అప్రతిష్ట పాల్జేయడానికి…

తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ సహా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ తరఫున వకాలత్తు పుచ్చుకున్నారు. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట.. మార్గదర్శి సంస్థను సీఐడీ వేధిస్తున్నదని, అప్రతిష్ట పాల్జేయడానికి ప్రయత్నిస్తున్నదని తమకు తోచిన రీతిలో భజన చేస్తూ ఉంటారు. 

ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు భఃజన చేసుకోవచ్చు. కానీ తమాషా ఏంటంటే.. సీఐడీ ఇంకా విచారణ జరుపుతూ ఉంది. మార్గదర్శి సంస్థ కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తూ ఉంది. సంస్థకు సంబందించిన ప్రతి వ్యవహారామూ చట్టప్రకారంగా, న్యాయబద్ధంగా ఉన్నట్లయితే వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. 

సీఐడీ, లేదా జగన్ సర్కారు పనిగట్టుకుని వారిని వేధించారని ప్రజలు కూడా తెలుసుకుంటారు. కానీ కోర్టులో ఒక విషయం తేలి, ప్రజలు తమంత తాము తెలుసుకునేదాకా ఈ భజనపరులు ఆగలేరు. తమ భజన అంశాలను అర్జంటుగా ప్రజల బుర్రల్లోకి ఎక్కించాలని వారి తాపత్రయం. తాజాగా ఆజాబితాలోకి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా చేరిపోయారు.

మార్గదర్శి చిట్స్ వేస్తున్న చందాదారుల్ని అత్యాచారానికి గురైన మైనర్ బాలికతో పోలుస్తారా? అంటూ ఆమె సీఐడీ చీఫ్ సంజయ్ మీద విరుచుకుపడ్డారు. ఆయన హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి పేర్కొన్న విషయాల్ని ఆమె ఖండించారు. ఇంతవరకు ఓకే. ఖండించడం ఆమె ఇష్టం. కానీ.. సీఐడీ చీఫ్ చెప్పిన సంగతుల్ని వక్రీకరించడం మాత్రం చాలా దారుణంగా ఉంది.

చందదారులకు వడ్డీలు పద్ధతిగా చెల్లిస్తున్నారు కదా అని విలేకరులు అడిగితే.. బాలికిలకు చాక్లెట్లు, బిస్కట్లు ఆశచూపి అత్యాచారం చేసినట్టుగా మార్గదర్శి సంస్థ వ్యాపారం చేస్తున్నదని సంజయ్ పోలిక తెచ్చారు. వడ్డీల ఆశ చూపి మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే వంగలపూడి అనిత.. అత్యాచారాల గురించే మాట్లాడినట్లుగా బాలికల మీదకు మళ్లించి చాలా అసహ్యకరమైన రీతిలో వ్యాఖ్యానాలు చెప్పడం ఆమె కురచబుద్ధికి నిర్శనంగా ఉంది.

ఐపీఎస్ అధికారి మాటలు.. మైనర్ బాలికలు చాక్లెట్లకు ఆశపడి అత్యాచారానికి అంగీకరిస్తారన్నట్లుగా ఉన్నాయని అనిత వక్రభాష్యం చెబుతున్నారు. ఈ మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి. మార్గదర్శి చేస్తున్న మోసాల తరహా గురించి మాట్లాడితే.. దానికి సంబందంలేని రెండో పార్శ్వం గురించి ఆమె వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అత్యాచారానికి గురైన బాలిక మానసిక స్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీ ఇంట్లో, పోలీసు విభాగంలో మహిళలు లేరా? అని అర్థం పర్థం లేకుండా మాట్లాడారు.

చందాదారులంతా అత్యాచారానికి గురైన వారా? మార్గదర్శి ఉద్యోగులంతా అత్యాచారాలు చేసేవారా? అంటూ ఆమె వక్రీకరణలతో మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది. మోసాలు ఎలా జరుగుతున్నాయో చెప్పిన సీఐడీ చీఫ్ సంజయ్ అసలు మాటలను వదిలేసి.. రామోజీ రావును ప్రసన్నం చేసుకోవడానికే మాట్లాడుతున్నట్టుగా, ఈనాడులో పబ్లిసిటీ బాగా వస్తుందనే కోరికతోనే ఇలాంటి వక్రబుద్ధులు ప్రదర్శిస్తున్నట్టుగా ఈ మాటలు గమనించిన ప్రజలు నవ్వుకుంటున్నారు.