వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని తహతహలాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులం, మతంతో పాటు కొత్తగా ఇతర హీరోల అభిమానులను దువ్వడం మొదలుపెట్టారు. మహేష్ బాబు, ప్రభాస్‌లు తనకంటే పెద్ద హీరోలంటూ బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇతర హీరోల గురించి చెప్పడం మొదలు పెట్టారు.
సినిమాల పరంగా హీరోల మీద ఉన్న ఇష్టాన్ని రాజకీయాల్లో చూపించోద్దని వేడుకున్నారు. సినిమాల్లో ఏ హీరోని ఇష్టపడిన రాజకీయాలు వచ్చేసరికి తన వైపు చూడాలంటున్నారు. అందరి హీరోల అభిమానులు తనకే ఓటేయాలని పరోక్షంగా కోరారు. పవన్ రిక్వెస్ట్‌పై ఇతర హీరోల అభిమానులు కూడా అదే రీతిలో రియాక్ట్ అవుతు.. ముందుగా పవన్ తన అభిమానులతో ఓటు వేయించుకోవాలని.. ఆయనే చాలా వేదికపైన మాట్లాడుతూ.. తన అభిమానులే తనకు ఓట్లు వేయడం లేదని వాపోయిన విషయం గుర్తుకు తెస్తున్నారు.
అదే విధంగా పవన్ తమ అభిమానులను కంట్రోల్లో పెట్టుకోవాలని.. ఇతర హీరోలపై ట్రోలింగ్లు చేయడం ఆపించాలని పవన్ కళ్యాణ్ కు సూచిస్తున్నారు. అదికాక ఏ హీరో సినిమాకు అయినా ముందుగా నెగిటివ్ టాక్ ప్రచారం చేసే దాంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందుగా ఉంటారనే అపవాద కూడా ఉంది. పవన్ ఫ్యాన్స్ స్టేట్మెంట్స్, సోషల్ మీడియాలో వారు చేసే హడావుడిని చూస్తే అందరికి నిజం అనిపిస్తుంది. వాటిపై కట్టడి చేయలనంటున్నారు.
కాగా ఏ హీరో సినిమా ఫంక్షన్ ఉన్న అందులోకి పవన్ కళ్యాణ్ అభిమానులు దూరి పవన్.. పవన్ అంటూ చేసే ఓవరాక్షన్ చూసి ఇతర హీరో అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై గుర్రుగా ఉంటారు. పవన్ ఫ్యాన్స్ పై స్వయంగా మెగా ఫ్యామిలీ లోని హీరోలే చాలా వేదికలపై కోప్పడిన విషయం తెలిసిందే. పవన్ ఫ్యాన్స్‌పై అల్లు అర్జున్, నాగబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ వేదికపై అల్లు అర్జున్ చెప్పను బ్రదర్.. చెప్పను బ్రదర్ అన్నందుకు అతని సినిమా ఎప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగా ట్రోల్ చేశారనేది బన్నీ అభిమానులు గుర్తుకు తెస్తున్నారు.
అలాంటి ఫ్యాన్స్‌ని ముందుగా కంట్రోల్లో ఉండమని చెప్పకుండా.. ఇతర హీరోల అభిమానుల్ని వేడుకోవడం వల్ల పవన్ కళ్యాణ్‌కు వచ్చిన ప్రయోజనం శూన్యం అంటున్నారు విశ్లేషకులు. పవన్ గురించి ఎవరు ఏమి మాట్లాడిన… ఏమి రాసిన వాటిని ఆర్ధం చేసుకోలేక ఇష్టం వచ్చినట్లు బూతు కామెంట్లు పెడతారని ఈ మధ్యనే ఆర్జీవి చెప్పిన విషయం తెలిసిందే.