టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాలుకు బలమైన గాయం కావడంతో చిత్ర యూనిట్ వెంటనే ఆస్పత్రికి తరలించిగా.. పరీక్షించిన డాక్టర్లు మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
హీరోగా చేస్తునే.. సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ సినిమాలో సైడ్ రోల్ చేశారు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు చిత్రంలో గెస్ట్ రోల్‌లో మెరిశారు. ఆ తరువాత ఆర్యన్ శుభాన్ దర్శకత్వంలో పోలీస్ నేపథ్యంలో ‘ది కానిస్టేబుల్’ సినిమాలో వరుణ్ సందేశ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దాదాపు 40 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.
కాగా 2007లో హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు వరుణ్ సందేశ్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలకు మంచి హిట్స్ అందుకున్నారు. కానీ గత కొంత కాలంగా స్టోరీ ఎంపికలో పొరపాట్లతో వరుసగా డిజాస్టర్స్ అందుకుంటున్నారు.