బాబూ నీకే రక్షణ లేదు…ఎంవీవీ ఘాటు కౌంటర్

సీఎం గా ఉమ్మడి ఏపీని పాలించిన చంద్రబాబు అలిపిరి దాడికి గురి కాలేదా అని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీకే రక్షణ లేదని మీకు అనిపించలేదా…

సీఎం గా ఉమ్మడి ఏపీని పాలించిన చంద్రబాబు అలిపిరి దాడికి గురి కాలేదా అని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీకే రక్షణ లేదని మీకు అనిపించలేదా అని విమర్శించారు.

అలాగే 2014 నుంచి 2019లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు అరకు ఎంపీ కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురి అయ్యారు. అపుడు తన పాలనలో రక్షణ లేదని అనిపించలేదా అని ప్రశ్నించారు. రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఒక కుక్క అని ఎంవీవీ సత్యనారాయణ విమర్శించారు.

తన భార్య తన కుమారుడు, తన ఆడిటర్ జీవీలను కిడ్నాపర్లు చావు దాకా తీసుకెళ్తే దాని మీద మానవత్వం చూపించి సానుభూతి చూపించాల్సింది పోయి ఇలాంటి తప్పుడు ఆరోపణలా అని ఆయన మండిపడ్డారు. తాను నాలుగేళ్ళూ విశాఖలో వైసీపీ ప్రభుత్వంలో వందకు పైగా భవనాలు కట్టానని, ఇంకా మరో పదిహేను బిల్డింగ్స్ నిర్మాణంలో ఉన్నాయని ఆయన వివరించారు.

తనకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని, తాను విశాఖలో వ్యాపారం చేయను అనడానికి టీడీపీ విపక్షాలే కారణం అని ఆయన స్పష్టం చేశారు. తాను ఇబ్బందుల్లో ఉంటే విపక్షాలు కిడ్నాప్ డ్రామా అంటూ రాజకీయాలు చేయడమేంటి అని మండిపడ్డారు. విశాఖలో అభివృద్ధి అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ వన్ లో ఉందని అన్నరు. అలాంటి చోట వ్యాపారం చేయని అని నేను ఎందుకు చెబుతాను అని ఆయన ప్రశ్నించారు. తనను ప్రతీ దానికీ నాలుగేళ్ళుగా విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ కిడ్నాప్ లో రాజకీయాలు లేవు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేవని, కేవలం డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ ఇది అని ఎంవీవీ స్పష్టం చేశారు.