ఖుషిలో పవన్ కల్యాణ్ లా వైష్ణవ్ తేజ్

పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఖుషి. అందులో పవన్ కల్యాణ్ కనిపించినంత హుషారుగా మరో సినిమాలో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ తర్వాత మెగా కాంపౌండ్ లో…

పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఖుషి. అందులో పవన్ కల్యాణ్ కనిపించినంత హుషారుగా మరో సినిమాలో కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ తర్వాత మెగా కాంపౌండ్ లో ఎవ్వరూ ఖుషీ ఛాయల్ని తమ సినిమాల్లో చూపించే ప్రయత్నం చేయలేదు. 

ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మాత్రం తన మేనమామ పవన్ మేనరిజమ్స్ ను అచ్చుగుద్దినట్టు ఫాలో అయిపోతున్నాడు. మరీ ముఖ్యంగా ఖుషీ ఎపిసోడ్ ను తన కొత్త సినిమాలో రిపీట్ చేస్తున్నాడు.

ఖుషీ సినిమాలో హీరోహీరోయిన్లు ఇగో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మనసులో ప్రేమ ఉన్నప్పటికీ తమకున్న ఇగో కారణంగా ఆ విషయాన్ని బయటకు చెప్పుకోరు. సరిగ్గా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రంగరంగ వైభవంగా సినిమాలో కూడా ఇలాంటిదే ఓ ఎపిసోడ్ ఉందంట. ఆ  ఎపిసోడ్ లో మరో ఆలోచన లేకుండా ఖుషిలోని పవన్ కల్యాణ్ లా నటించేశాడట వైష్ణవ్

వైష్ణవ్-కేతికశర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోంది రంగరంగ వైభవంగా. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, చిన్న వీడియో రిలీజైంది. ఇందులో వైష్ణవ్ తేజ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్ కేతికతో ఇగో ప్రాబ్లమ్స్ వచ్చే సందర్భంలో పవన్ కల్యాణ్ ను తలపిస్తాడట వైష్ణవ్.

గిరీశాయ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను జులై 1న విడుదల చేయబోతున్నారు. కొండపొలంతో ఫ్లాప్ అందుకున్న వైష్ణవ్ తేజ్, ఈ కొత్త సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.