అంటే పవన్ రాడని చెబుతున్నావా మనోహరా..!

“ప్రజలారా కదిలిరండి.. అందరం కలిసి ఈ ప్రభుత్వంపై ఉద్యమం చేద్దాం..” Advertisement “ఇకపై జనంతో కలిసి జనసేన ఉద్యమం.” నాదెండ్ల చెబుతున్న ఈ డైలాగ్స్ బాగున్నాయి కానీ, ఆ డైలాగ్స్ వెనక అంతరార్థం మాత్రం…

“ప్రజలారా కదిలిరండి.. అందరం కలిసి ఈ ప్రభుత్వంపై ఉద్యమం చేద్దాం..”

“ఇకపై జనంతో కలిసి జనసేన ఉద్యమం.”

నాదెండ్ల చెబుతున్న ఈ డైలాగ్స్ బాగున్నాయి కానీ, ఆ డైలాగ్స్ వెనక అంతరార్థం మాత్రం మరోలా ఉంది. జనంతో కలిసి జనసేన ఉద్యమం చేస్తుందని చెబుతున్న నాదెండ్ల.. పరోక్షంగా పవన్ కల్యాణ్ ఇలాంటి ఉద్యమాల్లోకి రారని, జనం, మనం కలిసి మాత్రమే ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని క్యాడర్ కు చెబుతున్నట్టుంది.

నిజమే.. ఇప్పుడు ఉద్యమాలు చేసేంత టైమ్ పవన్ కు లేదు. ఆయన మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి వినోదాయశితం రీమేక్ కాగా, ఇంకోటి సురేందర్ రెడ్డి సినిమా. ఈ రెండు సినిమాల కంటే ముందు హరిహర వీరమల్లు సినిమాకు ఏకంగా 5 నెలల బల్క్ కాల్షీట్లు రాసిచ్చేశారు. ఆగస్ట్ వరకు ఆ సినిమానే. అందుకేనేమో నాదెండ్ల ఇలా జనంతో కలిసి జనసేన ఉద్యమం అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఆ జనంలో, ఆ జనసేనలో.. జనసేనాని మాత్రం ఉండరనేది ఆయన ఇన్నర్ మీనింగ్.

ఆవిర్భావ దినోత్సవమే ఆఖరిదా..?

జనసేనాని ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. సభా వేదికపై చక్కగా నటించారు. ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయనే హింట్ కూడా ఇచ్చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆయన మళ్లీ కనిపించలేదు. పార్టీ కమిటీల ఎంపికలో పవన్ బిజీగా ఉన్నారని అంటున్నారంతా.

అయితే ఇప్పటికిప్పుడు కమిటీలు ప్రకటించినా 2024 ఎన్నికల నాటికి పొత్తుల కారణంగా ఆ కమిటీలతో ఎలాంటి ఉపయోగం లేదని కేడర్ కి కూడా తెలిసిపోయింది. ఎలాగూ త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చివర్లో ఓ స్టేట్ మెంట్ ఇస్తారని అనుకుంటున్నారు. సో ఇక్కడకూడా జనసేనాని చేసేదేం లేదు. కాబట్టి సినిమాల కోసమే పవన్ కల్యాణ్ జనాలకు దూరంగా ఉంటున్నారనే విషయం తేలిపోయింది. ఇక జనసేనలో ఉండాలా లేదా అనేది జనసైనికులు తేల్చుకోవాల్సిందే.

పాతికేళ్ల పోరాటం అంటే పాతికేళ్లలో సినిమా ఇంటర్వెల్ మధ్యలో పోరాటం అని జనాలు ఊహించలేదు. పవన్ మాత్రం అదే మనసులో పెట్టుకుని చెప్పారు. ఇప్పుడు నాదెండ్ల కూడా అదే మీనింగ్ వచ్చేలా చెబుతున్నారు. జనసైనికులకు ఎప్పుడు అర్థమౌతుందో ఈ నిజం.