మార్చి బరిలోకి గాలిసంపత్

చిన్న హీరో శ్రీవిష్ణు సినిమా అయినా, పెద్ద డైరక్టర్ అనిల్ రావిపూడి ప్రొడక్షన్ కావడం, కథ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడంతో అందరి దృష్టి పడింది.  Advertisement ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మరో ఆకర్షణ…

చిన్న హీరో శ్రీవిష్ణు సినిమా అయినా, పెద్ద డైరక్టర్ అనిల్ రావిపూడి ప్రొడక్షన్ కావడం, కథ, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించడంతో అందరి దృష్టి పడింది. 

ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మరో ఆకర్షణ తోడవుతోందని తెలుస్తోంది. ఏస్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పేరు కూడా ఈ సినిమాకు యాడ్ అవుతోందని తెలుస్తోంది.

దిల్ రాజు సమర్పించు అనే టైటిల్ కార్డ్ తో ఫస్ట్ పోస్టర్ మరో ఒకటి రెండు రోజుల్లో బయటకు వస్తుందని తెలుస్తోంది. అంతే కాదు. ఈ సినిమాను శివరాత్రి సందర్భంగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయం కూడా పోస్టర్ లో ప్రకటించే అవకాశం వుంది.

శివరాత్రి సందర్భంగా మార్చి 11న గాలిసంపత్ విడుదల పక్కా అయితే, శర్వానంద్ శ్రీకారం సినిమాకు గట్టి పోటీ తగిలినట్లే. పైగా నైజాంలో శ్రీకారం సినిమాను వరంగల్ శ్రీను, గాలిసంపత్ ను దిల్ రాజు పంపిణీ చేస్తారు. మళ్లీ పండగ టైమ్ లో వచ్చిన పోటీనే వచ్చే అవకాశం వుంది.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే