ఈ వీక్ ట్రేడ్ టాక్

సంక్రాంతికి పండుగ చేసుకున్న సినిమాలు ఆ తర్వాత నెమ్మదించాయి. ఆదివారం తర్వాత క్రాక్‌తో సహా అన్ని సినిమాలకు వసూళ్లు తగ్గాయి.  Advertisement అయితే క్రాక్ ఇప్పటికే లాభాల్లోకి వెళ్లింది. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో లాక్‌డౌన్…

సంక్రాంతికి పండుగ చేసుకున్న సినిమాలు ఆ తర్వాత నెమ్మదించాయి. ఆదివారం తర్వాత క్రాక్‌తో సహా అన్ని సినిమాలకు వసూళ్లు తగ్గాయి. 

అయితే క్రాక్ ఇప్పటికే లాభాల్లోకి వెళ్లింది. తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో లాక్‌డౌన్ తర్వాత విడుదలైన సినిమాలలో నిఖార్సయిన హిట్ సినిమా ఇదే.

రామ్ ‘రెడ్’ చిత్రానికి టాక్ ఆశాజనకంగా రాకపోయినా కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ క్రేజ్‌తో పాటు ఫెస్టివల్ అడ్వాంటేజ్ కలిసొచ్చి డీసెంట్ కలక్షన్స్ తెచ్చుకుంది. 

ఈ వీకెండ్‌తో పాటు రిపబ్లిక్ డేకి కలక్షన్స్ పుంజుకున్నట్టయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్క్ చేరిపోతుంది. అల్లుడు అదుర్స్ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సంక్రాంతి సినిమాలలో ఇదొక్కటే కమర్షియల్‌గా తీవ్రంగా నిరాశపరిచింది. తెలుగు సినిమాలతో పాటుగా విడుదలైన తమిళ అనువాద చిత్రం మాస్టర్ కమర్షియల్ సెక్సస్ సాధించింది. 

తొలి రోజు వచ్చిన వసూళ్లతోనే ఎనభై శాతం రికవరీ సాధించడంతో మాస్టర్ పని ఈజీ అయిపోయింది. ఆ తర్వాత పెద్దగా వసూళ్లు రాకపోయినప్పటికీ విజయ్ ఖాతాలో తెలుగు మార్కెట్ వరకు మరో హిట్ సినిమా ఇది.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!