తెలుగు చిత్ర పరిశ్రమలో నంబర్‌వన్ హీరోయిన్లుగా వెలిగిన అనుష్క, సమంత ఇప్పుడు హీరోయిన్ ప్రధాన చిత్రాలేక పరిమితం అవుతున్నారు.
అగ్ర హీరోలే కాదు వీరితో నటించడానికి ఒక మాదిరి తెలుగు హీరోలు కూడా ఆసక్తి చూపించడం లేదు. వారి సినిమాలో హీరో పాత్రకు ప్రాధాన్యత వుండదని, ఒకవేళ హీరోగా నటించినా కానీ తమను హీరో అనరని భయపడుతున్నారు.
సమంతతో ‘శాకుంతలం’ చిత్రాన్ని తలపెట్టిన గుణశేఖర్ అందులో దుష్యంతుడి పాత్ర కోసం పలువురు తెలుగు హీరోలను సంప్రదించగా అందరూ నో అన్నారట.
సమంత కథానాయిక అయితే ఇక తమకు ఇంపార్టెన్స్ ఏముంటుందని, ఎంత భారీ చిత్రమయినా కానీ కెరీర్ పరంగా ఒరిగేదేమి వుండదు కనుక నటించలేమని కచ్చితంగా చెప్పేసారట.
దాంతో ఆ పాత్రకు ఓ మలయాళీ నటుడిని ఎంచుకున్నారని సమాచారం. అనుష్కని అగ్ర హీరోలే కాదు చివరకు అరవై దాటిన హీరోలు కూడా ఇప్పుడు కన్సిడర్ చేయడం లేదు. ఆమెకంటే శృతిహాసన్, కాజల్‌ని ప్రిఫర్ చేస్తున్నారు.
నేషనల్ వైడ్ గుర్తింపు వున్నా కానీ అనుష్కతో నటించేందుకు హీరోలు ఆసక్తి చూపించకపోవడంతో ఈమధ్య దర్శక, నిర్మాతలు కూడా ఆమెను దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం లేదు.