పూరి- ఫాజిల్- ఏమిటి కథ?

పూరితో ఓ సినిమా చేయడానికి ఫాజిల్ ఓకె అన్నారు అన్నది మాత్రం పక్కాగా తెలుస్తున్న సంగతి.

దర్శకుడు పూరి జగన్నాధ్ అనేకానేక ఫ్లాపులు ఇచ్చి వుండొచ్చు. కానీ ఇప్పటికీ ఆయనకు వుండాల్సిన క్రేజ్ ఆయనకు వుంది. అందుకే లేటెస్ట్ గా విజయ్ సేతుపతి డేట్ లు ఇచ్చారు. సినిమా మొదలుపెట్టబోతున్నారు. బెగ్గర్ అనేది టైటిల్ అని వార్తలు వచ్చాయి. సీనియర్ నటి టబు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇదిలా వుండగానే మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది.

మంచి నటుడు ఫాహిద్ ఫాజిల్ కూడా పూరితో ఓ సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫాజిల్ హీరోగా సినిమా చేస్తారా? లేదా ఫాజిల్ కీలకపాత్రలో వుంటూ మరో హీరో వుండే సినిమా చేస్తారా? అసలు దేని కోసం ఫాజిల్ డేట్ లను పూరి సంపాదించారు అన్నది క్వశ్చను.

పూరితో ఓ సినిమా చేయడానికి ఫాజిల్ ఓకె అన్నారు అన్నది మాత్రం పక్కాగా తెలుస్తున్న సంగతి. ఫాజిల్ నాలుగు సినిమాలు లైన్ లో పెట్టుకున్నారు. వాటిలో పూరితో చేసేది ఓకటి. రెండోది ఇటీవల వచ్చిన సత్యం-సుందరం దర్శకుడి డైరక్షన్ లో మరొకటి. మరో రెండు సినిమాలు కూడా వున్నాయి. వీటిల్లో పూరి సినిమా ఎప్పుడు అన్నది తెలియదు. అయినా విజయ్ సేతుపతి సినిమా అయిన తరువాతే పూరి ఏ సినిమా అయినా చేసేది.

ఫాజిల్ ఒకె అన్న వరకు సరే, విజయ్ సేతుపతితో సినిమా హిట్ అయితేనే ఫాజిల్ సినిమా ముందుకు వెళ్తుందన్నది కూడా అంతే వాస్తవం.

3 Replies to “పూరి- ఫాజిల్- ఏమిటి కథ?”

  1. “బెగ్గర్” మంచి టైటిల్. ఎవరిని ఉద్దేశించో తెలిస్తే విడుదల లోపు సర్దుకోవచ్చు!

Comments are closed.