విజ‌యసాయిరెడ్డిని పిలిచారా.. పిలిపించుకున్నారా?

లిక్క‌ర్ స్కామ్‌లో విచార‌ణ‌కు రావాల‌ని విజ‌య‌సాయిరెడ్డికి సిట్ టీమ్ నోటీసులు ఇచ్చిందా? త‌నే ఇప్పించుకున్నారా?

లిక్క‌ర్ స్కామ్‌లో సాక్షిగా విచార‌ణ‌కు రావాలని మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి సిట్ బృందం నోటీసులు ఇచ్చింది. ఇక్క‌డే విజ‌య‌సాయిరెడ్డిపై ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి. గ‌తంలో విచార‌ణ‌కు హాజ‌రైన విజ‌య‌సాయిరెడ్డికి త‌న‌కేం పాపం తెలియ‌ద‌ని చెప్పే వ‌ర‌కూ ప‌రిమిత‌మై వుంటే, ఆయ‌న‌పై ఎలాంటి అనుమానాలు వ‌చ్చేవి కావు. లిక్క‌ర్ స్కామ్‌కు క‌ర్త‌, కర్మ‌, క్రియ రాజ్ క‌సిరెడ్డి అని విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. భ‌విష్య‌త్‌లో ఇంకా వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని ప‌రోక్షంగా ఆయ‌న అన్నారు.

తాజాగా ఈ నెల 17న విచార‌ణ‌కు రావాల‌ని ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇటీవ‌ల కాలంలో విజ‌య‌సాయిరెడ్డిలో రాజ‌కీయంగా చాలా మార్పు వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా త‌న‌ను దూరం పెట్టార‌నే ఆవేద‌న ఆయ‌న్ను ద‌హించివేస్తోంది. దీంతో త‌న‌కు అన్యాయం చేసిన వాళ్ల‌ను, స‌మ‌యం చూసుకుని దెబ్బ కొట్టాల‌ని ఆయ‌న ఎదురు చూస్తున్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో లిక్క‌ర్ స్కామ్‌లో విచార‌ణ‌కు రావాల‌ని విజ‌య‌సాయిరెడ్డికి సిట్ టీమ్ నోటీసులు ఇచ్చిందా? త‌నే ఇప్పించుకున్నారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. విచార‌ణ‌కు సాక్షిగా వెళ్లి, త‌న‌కు గిట్ట‌ని వాళ్ల పేర్ల‌న్నీ వాంగ్మూలం రూపంలో ఇవ్వాల‌ని అనుకుంటున్నారా? త‌దిత‌ర ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

విజ‌య‌సాయిరెడ్డి టార్గెట్ పెట్టుకున్నోళ్లంద‌రినీ ఇరికించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మీడియా ఎదుటే లిక్క‌ర్ స్కామ్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విజ‌య‌సాయి… ఇక విచార‌ణ‌లో ఏం చెబుతారో అంచనా వేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అందుకే విజ‌యసాయిరెడ్డి విచార‌ణ‌పై ఆస‌క్తి, ఉత్కంఠ‌.

10 Replies to “విజ‌యసాయిరెడ్డిని పిలిచారా.. పిలిపించుకున్నారా?”

  1. విజయ సాయి రెడ్డి నొరు తెరిస్తె మన గుట్టు అంతా భయటపడుతుంది అని GA తెగ భయపడుతున్నట్టు ఉన్నాడు!

    విజ‌య‌సాయిరెడ్డి టార్గెట్ పెట్టుకున్నోళ్లంద‌రినీ ఇరికించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.. అంటూ ముందె జనం ని ప్రిపెర్ చెస్తున్నాడు!

  2. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కదా అన్నయ్య పార్టీ పెట్టింది ఏదో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నట్లు..

    సాయిరెడ్డి కూడా అంతే గా ..

  3. లిక్కర్ స్కాం లో పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎవడి పేరు పడితే వాడి పేరు చెప్తే కుదరదు గా జి a అందరి పేర్లు బయటికి వస్తాయి .గాబరా వద్దు స్పాయి అనే సినిమా కూడా తీసారు అంటా గా లిక్కర్ సొమ్ములతో రాజ్ కసిరెడ్డి అనేవాడు తప్పు చెయ్య క పోతే పోలీస్ విచారణ కు రావలుఇ గా

Comments are closed.