ఆ సినిమాలు గుల్ల చేసాయి

ఇప్పుడు హిట్ 3 అన్నది లేటెస్ట్ అట్రాక్షన్. అది హిట్ అయితే ఫరవాలేదు. ఎందుకంటే ఈ సమ్మర్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ల్లో అది ఒకటి.

టాలీవుడ్ క్లిష్ట పరిస్థితుల్లో వుంది. థియేటర్ల దగ్గర సినిమాలు బోల్తా పడుతున్నాయి. దాని ప్రభావం విడుదలవుతున్న, విడుదల కాబోయే సినిమాల మీద పడుతోంది. దీంతో ఆయా సినిమాల నిర్మాతలు తలపట్టుకుంటున్నారు. సినిమాలు కొంటామని, విడుదల చేస్తామని ముందుకు వచ్చిన బయ్యర్లు లాస్ట్ మినిట్ లో చేతులు ఎత్తేస్తున్నారు. ఎగ్జిబిటర్లు డబ్బులు కడితే వాటిని బయ్యర్లు నిర్మాతకు కడతారు. అంతే తప్ప తమ ఇంట్లోంచి తెచ్చి కట్టరు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలి మూడున్నర నెలల కాలంలో హిట్లు తక్కువ. ఫ్లాపులు ఎక్కువ కావడంతో ఎగ్జిబిటర్లు దాదాపు కుదేలయిపోయారు. అడ్వాన్స్ లు అన్నీ బయ్యర్ల దగ్గర ఇరుక్కుపోయాయి. దాంతో కొత్త సినిమాలకు డబ్బులు ఇవ్వడం అన్నది ఇక లేదు. ఎందుకంటే ఎగ్జిబిటర్ల డబ్బులే బయ్యర్ల దగ్గర వున్నాయి. దాని వల్ల ఇప్పుడు ఈవారం, వచ్చేవారం విడుదలయ్యే సినిమాలకు డబ్బులు కట్టాలంటే బయ్యర్లు కిందా మీదా పడాల్సిన పరిస్థితి. దాని వల్ల డబ్బులు కట్టలేక చేతులు ఎత్తడం లేదా, సినిమా పంపిణీ చేయగలం తప్ప మరేమీ చేయలేమని చెప్పడం జరుగుతోంది.

సంక్రాంతికి వస్తున్నాం మంచి హిట్ అయింది జనవరిలో. కానీ గేమ్ ఛేంజర్ కు కట్టిన డబ్బులకు సరిపోయింది. ఆ తరువాత రాబిన్ హుడ్, దిల్ రుబా, లైలా, మజాకా, జాక్ ఇలా చాలా సినిమాలు ఆడలేదు. ముఖ్యంగా రాబిన్ హుడ్, జాక్ సినిమాలకు కాస్త పెద్ద మొత్తాలు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈవారం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. మలి వారం ఒక సినిమా వుంది. ఆఖరులో హిట్ 3 వుంది. ఆ సినిమా వరకు ఓకె కానీ ఈ లోపల వచ్చే సినిమాలకు డబ్బులు కట్టడం అంటే అటు ఇటు చూస్తున్నారు బయ్యర్లు.

ఓవర్ సీస్ బయ్యర్ ఇటీవల రెండు మూడు సినిమాలకు కలిపి రెండు మిలియన్లకు పైగా వసూళ్లు కళ్ల చూడాలి. కానీ ఒకటిన్నర మిలియన్ రాలేదు. దాంతో చిన్న, మిడ్ రేంజ్ సినిమాల వైపు చూడడం లేదు.

ఇప్పుడు హిట్ 3 అన్నది లేటెస్ట్ అట్రాక్షన్. అది హిట్ అయితే ఫరవాలేదు. ఎందుకంటే ఈ సమ్మర్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ల్లో అది ఒకటి. అందువల్ల అందరూ డబ్బులు కడతారు. కానీ అది తేడా చేస్తే ఇక ఆ ప్రభావం మొత్తం సమ్మర్ మీద పడుతుంది. దాని తరువాత వచ్చే కింగ్ డమ్ కావచ్చు మరేదేైనా కావచ్చు.

One Reply to “ఆ సినిమాలు గుల్ల చేసాయి”

Comments are closed.