బాబుకు షాకులు : అమరావతి రైతుల ఆగ్రహం!

ఇప్పుడు ఆయన చెప్పినట్టల్లా ఆడిన అమరావతి రైతులు ఇప్పుడు ఆయన మీదికే తిరగబడుతున్నారు.

ఏ అమరావతి రైతులనైతే.. తన రాజకీయ ప్రయోజనాల కోసం.. ప్రత్యర్థుల మీదికి సంధించే అస్త్రాలుగా చంద్రబాబునాయుడు ఇన్నాళ్లూ వాడుకున్నారో.. ఆయన అమ్ముల పొదిలోని అవే అస్త్రాలు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాయి.

అమరావతి రాజధాని పేరుతో రైతుల నుంచి సమీకరించడంతో కలిపి అందుబాటులో ఉన్న 54 వేల ఎకరాల భూముల్లో ఒప్పటిదాకా ఒక్కటంటే ఒక్కటైనా శాశ్వత నిర్మాణం పూర్తికాకపోగా.. అప్పుడే అమరావతి విస్తరణ, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి పడికట్టు మాటలతో మరో 44 వేల ఎకరాలు సేకరించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం మొదలుపెడుతున్న ప్రయత్నాల పట్ల అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందుగా తమ సంగతి తేల్చేదాకా, అమరావతి నిర్మాణం పూర్తిచేసేదాకా ఇతర ‘ఎక్స్ ట్రా’ ప్రయత్నాలు మానుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు.

అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములను సమీకరించినప్పుడు.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందం ఒక్కటే. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన రాజధానిలో మీకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తాం. మీ భూముల విలువ కంటె అప్పటికి ఆ ప్లాట్ల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా లాభపడతారు అని చెప్పారు. ఆ మాటలు నమ్మి రైతులు భూములు ఇచ్చారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అమరావతిని పూర్తిగా విస్మరించకుండా దానిని శాసన రాజధానిగా మార్చి, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు.. రైతులు కోర్టుకు వెళ్లినది కూడా ప్రభుత్వ హామీ మీదనే.

తమకు ఒప్పంద పత్రాల్లో మాట ఇచ్చినట్టుగా.. అభివృద్ధి చేసిన నగరంలో ప్లాట్లను అందించిన తర్వాతనే ఇతర ప్రయత్నాల జోలికి వెళ్లాలని, అలాగే అమరావతి ప్రాంతాన్ని మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు. వారికి అనుకూలంగానే కోర్టు తీర్పు చెప్పింది.

ఇప్పుడు చంద్రబాబునాయుడు నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమరావతిలో పనులకు శ్రీకారం దిద్దలేకపోతుండగా.. అప్పుడే పొరుగున ఉన్న మరో 44 వేల ఎకరాల మీద కన్నేయడం అనేది అమరావతి రైతుల్లో మంట పుట్టిస్తోంది. చంద్రబాబునాయుడు మాట తప్పుతున్నారని.. ఇన్నాళ్లూ ఆయనకు కొమ్ముకాసిన రైతులే ఇప్పుడు మండిపడుతున్నారు.

జగన్ మీద న్యాయపోరాటం చేయడానికి ఇదే అమరావతి రైతులను తెరవెనుక నుంచి నడిపిస్తూ వారితో హైకోర్టుల్లో కేసులు నడిపించినట్లుగా చంద్రబాబు మీద ఆరోపణలున్నాయి. అయితే.. ఇప్పుడు ఆయన చెప్పినట్టల్లా ఆడిన అమరావతి రైతులు ఇప్పుడు ఆయన మీదికే తిరగబడుతున్నారు. పోరాటానికి సిద్ధం అవుతున్నారు. రాజధాని పూర్తయ్యేదాకా కొత్తగా భూసమీకరణ ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

12 Replies to “బాబుకు షాకులు : అమరావతి రైతుల ఆగ్రహం!”

  1. అవునా నిజమే నా ఇంకేం దుకు ఆలస్యం మన సాక్షి లో వారితో ఉద్యమం చేయిస్తే సరిపోతుంది కదా

  2. అంటె కొత్తగా మా పొలం ఇవ్వం… అని ఎవరూ గొడవ చెయటం లెదు.

    అంతకు ముందు ఇచ్చిన వారు మాత్రమె ముందు మా దగ్గర పనులు పూర్తి చెయండి అంటున్నారు అంటావ్!

    వాళ్ళ పనులు పూర్తి అవుతాయి. ఇప్పటికె టెందెర్లు పిలిచారు, పనులు మొదలు అవుతున్నాయి!

  3. అమరావతి లో ఎవ్వరు మునిగితే మనకెందుకి గాని ..11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11+11=220 రోజుల క్రితం ప్రకటించిన కోటి రూపాయలు ఎక్కడ కొంచెం కనుకొని చెప్పవ వెంకీ ..అల్లాగే కొట్టేసిన ఫర్నిచర్ ఎప్పుడు వెనక్కిస్తాడో ?

Comments are closed.