ప్రభుత్వ నిర్వహణలోని కళాశాలలు, స్కూళ్లు విద్యాసంస్థల్లో చదువుకుంటూ అత్యుత్తమ మార్కులు సాధించిన 53 మంది టాపర్లకు ‘షైనింగ్ స్టార్స్ 2025’ పేరుతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఒక సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివేవారికి మార్కులు రావు అనే ముద్రను మీరు చెరిపేశారు అంటూ ఆయన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ 52 మంది టాపర్లకు బంగారుపతకాలు, లాప్ టాప్ లు అందజేశారు.
52లో 43 మంది అమ్మాయిలే కావడం విశేషం. సర్కారీ విద్యాసంస్థలు అంటే కేవలం నిరుపేదలు మాత్రమే చదువుకునే సంస్థలుగా ముద్రపడిపోయింది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాల నుంచి మంచి మార్కులు తెచ్చుకున్న వారిని సత్కరించి ప్రోత్సహిస్తున్నందుకు లోకేష్ ను కూడా అభినందించాలి.
అయితే ఈ కారణం చేత విద్యావ్యవస్థలో ఉన్న లొసుగులను, లోపాలను విస్మరించలేము. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నూరుశాతం పాస్, టాప్ గ్రేడ్ మార్కులు రావడం గురించి ప్రభుత్వ ఆయా సంస్థలను వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నప్పుడు మాస్ కాపీయింగ్ లను ప్రోత్సహించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. పిల్లలకు పుస్తకాలు ఇచ్చి రాయిస్తున్న ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లు కూడా ఉన్నాయి.
ఎన్ని అడ్డదారులైనా తొక్కు.. పిల్లలందరూ పాస్ కావాలి.. వాళ్లకు మంచి మార్కులు రావాలి.. అనే ఒత్తిడి ఒక్కటే టీచర్ల మీద కనిపిస్తోంది. ఇలాంటి పోకడల వలన తప్పుడు పనులు చేసైనా సరే.. నెగ్గుకు రావడం మాత్రమే ముఖ్యం అనే ధోరణిలోకి స్టూడెంట్స్ పతనం అయిపోతున్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మార్కలు దండిగా వచ్చాయని మురిసిపోతున్న నారా లోకేష్.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి ఎంట్రెన్సు పరీక్షలకు ప్రభుత్వ కళాశాలల లెక్చరర్లతోనే కనీసం జిల్లాకు ఒక ప్రత్యేక కోచింగ్ సెంటరును ఏర్పాటుచేయగలరా? ఈ మార్కులు ఎక్కువ వచ్చరే పేద పిల్లలకు ఆ కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు ఇచ్చి.. వారికి మంచి ర్యాంకులు వచ్చేలా చేయగలరా అనే సవాళ్లు ఎదురవుతున్నాయి. అది సాధ్యం కాదు.
ఎందుకంటే.. పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించినట్టుగా.. ఎంట్రెన్సు టెస్టుల్లో ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారితో మాత్రం కాపీయింగ్ చేయించడం అనేది కుదరదు. వీటన్నింటినీ మించి.. ఆ ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపితే.. తమకు ఆర్థికంగా అండగా ఉండే ప్రెవేటు కోచింగ్ సెంటరు సంస్థలు ఆగ్రహిస్తాయని నాయకులే పట్టించుకోరు.
మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను అవమానించడం కాదు గానీ.. ఈ మార్కుల, నూరుశాతం పాస్ ఒత్తిడి వలన విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతున్నదనే సంగతిని ఒప్పుకోవాలి. వ్యవస్థకు అలాంటి ఒత్తిడి చేస్తున్న గాయాల మీద.. ఇలాంటి సత్కారాల రూపంలో ముసుగులు వేసేసి బాహ్య ప్రపంచాన్ని మభ్యపెడుతున్నారని కూడా అనుమానించాలి.
అసలు మాస్ కాపీ కి ఛాన్స్ ఎక్కడ…అన్న నాడు నేడు కింద బడుల దిశను మార్చేసాడు కదా?పక్క రాష్ట్ర, దేశ విద్యార్థులు కూడా ఆంధ్ర ప్రభుత్వ బడులు చూసి ఆహ అన్న ఓహో అన్న అంటూ మేము ఇక్కడే చదువుతాం అంటున్నారుగా….ఇంకా మాస్ కాపీ కి ఛాన్స్ యాడిది
yera l 11 lk kj shekka 19-24 lo schools diha marchadu anduke vachai ani article rasthe neeli lk kj lu nee pen.. tinevaru
అమ్మ వడి వంటి కార్యక్రమాల కన్నా స్కూళ్లను అభివృద్ధి పరచి ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా సౌకర్యాలు టీచర్ లను ట్యూటర్ లను పెట్టి చదువులు చెప్పిస్తే చాలామంది ప్రైవేట్ బాట వదిలి ప్రభుత్వస్కూళ్ల బాట పడతారు ప్రతి స్కూల్ కి స్థానికంగా వున్నా నిరుద్యోగులైన యువకులను తాత్కాలిక ప్రాదిపదికన విద్యావాలంటీర్ ల గ నియమించుకొంటే టీచర్ లు ఏ కారణం చేతనైన సెలవులు పెడితే విద్యార్థులకు నష్టం జరగదు +వాళ్లకు స్టడీ hour లు పెట్టి చదివించొచ్చు దీనివలన చాలామంది పేరెంట్స్ కి ఖర్చు తగ్గుతుంది టీచర్ ల మీద పేరెంట్స్ కి ప్రైవేట్ స్కూల్ మాదిరి కంప్లైంట్ చేయటానికి ఒక వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థకి తక్షణం చర్యలు తీసుకొనే అధికారాలు కూడా ఉండాలి అప్పుడే ప్రజలు ప్రభుత్వ స్కూళ్లను నమ్ముతారు టీచర్ లకు అక్కడే క్వార్టర్ లు ఉండాలి వాళ్ళు కచ్చితం గ అక్కడే ఉండేలాగా రూల్స్ ఉండాలి
సై కో రాజకీయం, పార్టీల మధ్య ఉండాలి.. ఇలా రాష్ట్ర ప్రగతి పై ఏడవకూడదు..
వీళ్ళని సై కోలు అనేది ఇందుకే. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి దేశ వ్యాప్తంగా బ్రాండింగ్ చేస్తున్నాడు. యువతకు ఉద్యోగాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశలు వివరిస్తున్నాడు. ఈ సై కో గాడు, అదేమీ లేదు, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, ఉద్యోగాలు ఇవ్వొద్దు అని పబ్లిక్ గా ఏడుస్తున్నాడు. వీళ్ళకి సై కో రాజకీయం తప్ప, రాష్ట్ర ప్రగతి అనేది నచ్చదు..