రాహుల్… భలే నచ్చేస్తున్నాడే…!

రాహుల్ గాంధీ ప్రిన్స్ అని కాంగ్రెస్ మహారాజుల కోటలో రాకుమారుడుగా ఉంటాడని అంతా అనుకుంటూ ఉండేవారు. ఆ రకమైన సందేహాలను పటాపంచలు చేస్తూ రాహుల్ తాను సాదా సీదా మనిషిని అని చాటి చెప్పేలా…

రాహుల్ గాంధీ ప్రిన్స్ అని కాంగ్రెస్ మహారాజుల కోటలో రాకుమారుడుగా ఉంటాడని అంతా అనుకుంటూ ఉండేవారు. ఆ రకమైన సందేహాలను పటాపంచలు చేస్తూ రాహుల్ తాను సాదా సీదా మనిషిని అని చాటి చెప్పేలా గత ఏడాది భారత్ జోడో యాత్రను నిర్వహించి తానేంటో చాటుకున్నారు.

రాహుల్ డౌంట్ టూ ఎర్త్ అన్నది నాటి నుంచే అందరికీ తెలిసింది. రాహుల్ లో చిలిపితనం ఉంది. హుందాతనం ఉంది, పేదల పట్ల స్పందించే గుణం ఉంది, పెద్దల పట్ల మర్యాద ఉంది. ఇలా రాహుల్ లోని కొత్త మనిషిని భారత్ జోడో యాత్ర నిరూపించింది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ తన స్టైల్ మొత్తం ఇటీవల కాలంలో మార్చేశారు.

మిగిలిన పార్టీల అగ్ర నేతల మాదిరిగా ఆయన బహిరంగ సభలను నిర్వహిస్తూ వేదిక మీద నుంచే ప్రసంగించి వెళ్ళిపోవడం కాదు, రోడ్ కార్నర్ మీటింగ్స్ తో ప్రజలకు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నారు. అంతే కాదు తన దారిలో కనిపించే టీ స్టాల్స్ లో ఆగి చాయ్ తాగుతూ సామాన్యులతో బాతాఖానీ వేస్తున్నారు. వారి కష్టసుఖాలలో తాను భాగం అవుతున్నారు.

ఒక విధంగా రాహుల్ మనవారే అనే భావన కలిగిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ జగిత్యాలలో పర్యటించారు. ఆయన అక్కడ రోడ్డు పక్కన ఆగి మరీ హొటెల్ వద్ద దోశెలు తిన్నారు. తినడానికి కంటే ముందు దోశెలను రాహుల్ గాంధీ వేశారు. రాహుల్ చాలా అందంగా పెనం మీద దోశెలు వేయడం అందులో ఆయన నేర్పరితనం చూస్తూంటే సకల కళా వల్లభన్ అనిపించేశారు. తాను వేసిన దోశెలను అక్కడ పార్టీ నాయకులకు స్వయంగా అందించడం ద్వారా రాహుల్ తాను లీడర్ ని కాదు సేవకుడిని అని చెప్పకనే చెప్పారు.

ఇక అక్కడికి వచ్చిన స్థానిక ప్రజలతో ఆయన ముచ్చట్లు పెట్టారు. అక్కడ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన వద్దకు వచ్చే పిల్లలను ముద్దు చేస్తూ తన చేతిలోని చాక్లెట్లను వారికి రాహుల్ ఇచ్చారు ఒక విధంగా తాను ఒక కామన్ మ్యాన్ గా రాహుల్ చెప్పకనే చెప్పారని అంటున్నారు.

రాహుల్ గాంధీని చూసేందుకు కూడా జనాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అలా రాహుల్ గాంధీ హొటెల్ వద్ద దోశెలు వేస్తూ తింటూ కాంగ్రెస్ నేత ఇంత సింపుల్ గా ఉంటారా అనిపించారు. రాహుల్ గాంధీలో కొత్త కోణాన్ని స్థానిక ప్రజలు చూశారు. తెలంగాణాలో కాంగ్రెస్ కి ఊపు తెచ్చేందుకు రాహుల్ సభలు నిర్వహిస్తున్నారు. 

అయితే సభల కంటే కూడా ఎక్కువగా రాహుల్ ఈ విధంగా జన సామాన్యంతో కలిసిపోవడం ద్వారా ఎక్కువగా ప్రభావం చూపిస్తారు. నిజంగా రాహుల్ భలే నచ్చేస్తున్నాడు అనిపిస్తున్నారు. రాహుల్ గాంధీ భావి భారత నాయకుడిగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంతకంతకు జనం మద్దతు పొందుతున్నారు అనిపిస్తోంది ఆయన పర్యటనలు ఆయన జనంతో కలసి పెట్టే ముచ్చట్లూ చూస్తూంటే.