ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అన్నది కేవలం పాయింట్ కాదు. అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా వుంటుందన్నది కీలకం. ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో గుర్తుండిపోయే వాటిల్లో జై లవకుశ, అరవింద సమేత సిన్మాల్లోని పాత్రలు కచ్చితంగా వుంటాయి. ముఖ్యంగా అరవింద సమేత లోని హీరో పాత్రలో అన్ని వేరియేషన్లు. వుంటాయి. ఎన్టీఆర్ లాంటి నటుడిని ఎంత బలంగా ప్రెజెంట్ చేయవచ్చో అంత బలంగానూ ప్రెజెంట్ చేసారు.
ఇటు మాస్ ఎలివేషన్లు, అటు క్లాస్ అప్రిసియేషన్ కలగలిసిన పాత్ర అరవింద సమేతలో ఎన్టీఆర్ కు దొరికింది. రాజమౌళి సినిమాల్లో సింహాద్రి సినిమాలో మాస్ ఎలివేషన్లు, కొంత ఎమోషన్ వు్న్నా అది టూ ఎర్లీ స్టేజ్ లో చేసింది కావడంతో అరవింద సమేతలో కనిపించిన మాన్లీనెస్ వుండదు. యమదొంగలో యముడిగా మాత్రం గుర్తుండిపోయే పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడు.
ఎన్టీఆర్ లాంటి నటుడిని పూర్తిగా వాడుకునేలా, అతన్ని అంతకు అంతా ఎలివేట్ చేసేలా, అతనిలోని వేరియేషన్లను పక్కాగా ప్రెజెంట్ చేసేలా తయారు చేసిన పాత్రలు ఏమైనా వున్నాయా అంటే అవి కేవలం జై లవకుశ, అరవింద సమేత సినిమాల్లో మాత్రమే. అలాంటి కాంబినేషన్ త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అయినట్లే అయింది. కానీ ఎందుకో ఎక్కడో తేడా కొట్టింది.
ఆర్ఆర్ఆర్ తరువాత పాన్ ఇండియా సినిమా చేయాలా? కేవలం సౌత్ సినిమా చేయాలా అన్న డైలామా అప్పట్లో ఎన్టీఆర్ ను బాగా వెంటాడినట్లు బోగట్టా. అంతే కాదు. ఆర్ఆర్ఆర్ స్టామినా చూస్తే తప్ప తన రెమ్యూనిరేషన్, సినిమా రేంజ్ ఫిక్స్ చేసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి ఎక్కడ తేడా కొట్టిందో త్రివిక్రమ్ కు దూరం అయ్యారు. కానీ ఎన్టీఆర్ దూరం కాలేదని, ఆయన చుట్టూ వున్న కొందరి కారణంగానే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనే టాక్ వుంది. చుట్టూ వున్న కొందరు ఎన్టీఆర్ ను రాంగ్ ట్రాక్ లోకి నడిపిస్తున్నారనే గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
ఏమైనా సరే, ఎన్టీఆర్ తో ఎవరైనా సక్సెస్ ఫుల్ సినిమా తీస్తారు. అందులో సందేహం లేదు. కానీ ఎన్టీఆర్ ను మరో మెట్టు అన్ని విధాలా ఎక్కించే పాత్రను తయారు చేసి దాంతో సినిమా చేయాలి. అలాంటి స్టామినా కొంత మంది డైరక్టర్లకే వుంటుంది. సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి వాళ్లే ఇలాంటివి చేయగలరు. అంతే కానీ అనిల్ రావిపూడితో సరదా సినిమా తీస్తే ఉపయోగపడదు అన్నది ఫ్యాన్స్ లో వినిపిస్తున్న అభిప్రాయం.
ప్యాచప్ అన్నది ఇండస్ట్రీలో అతి చిన్న విషయం. మహేష్ కు త్రివిక్రమ్ గతంలో ఇలాగే గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇద్దరూ ఒకటయ్యారు. అలాగే త్రివిక్రమ్ ను కచ్చితంగా దగ్గరకు తీసుకోవడం ఎన్టీఆర్ కే అవసరం..మంచిది కూడా.