పోస్ట్ కరోనా ఉత్సాహం టాలీవుడ్ లో పొంగుతోంది. మరో సినిమాకు డేట్ వచ్చేసింది. శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన శ్రీకారం సినిమాను మార్చి 11న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
అన్ని ఉద్యోగాల మాదిరిగానే వ్యవసాయాన్ని కూడా ఓ వృత్తి, ఉద్యోగంగా చూడాలని, అలాగే ఆర్గానిక్ వ్యవసాయం పై యువత దృష్టి పెట్టాలనే లైన్ తో తయారవుతున్న సినిమా శ్రీకారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలు మాంచి హిట్ అయ్యాయి. వాటిల్లో పెంచలదాస్ పాడిన పాట ఒకటి.
మార్చి 11 మంచి డేట్ గా నిర్మాతలు భావిస్తున్నారు. అదే రోజు చాలా సినిమాలు వుండే అవకాశం వుంది. వరుస సెలవులు వచ్చినందున అందరి దృష్టి దానిమీద వుంది. మంచు విష్ణు మోసగాళ్లు కూడా ఇదే డేట్ కు వచ్చే అవకాశం వుంది.
ఇదిలా వంటే నానితో నిర్మాత సాహు గారపాటి నిర్మించి టక్ జగదీష్ కూడా ఇదే డేట్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు అవుతుంది. మళ్లీ థియేటర్ల తలకాయనొప్పి తప్పదేమో?