ఎమ్మెల్యే ద్వారంపూడి స‌వాల్.. ప‌వ‌న్ ఓకేనా!

గత నాలుగు రోజులుగా గల్లీ నాయకుల కంటే వైసీపీ నాయ‌కుల‌పై ఘోరంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ గోదావ‌రి జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్.. నిన్న కాకినాడలో ఆ ప్రాంత‌…

గత నాలుగు రోజులుగా గల్లీ నాయకుల కంటే వైసీపీ నాయ‌కుల‌పై ఘోరంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ గోదావ‌రి జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్.. నిన్న కాకినాడలో ఆ ప్రాంత‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో ఇవాళ ఆయ‌న‌ అదే విధంగా ప‌వ‌న్‌కు సమాధానం చెప్పారు.

తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాను కూడా ఆయ‌న‌ పెళ్లిళ్ల గురించి… హీరోయిన్లతో  ప‌వ‌న్‌కు ఉన్న‌ రిలేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని.. ప‌వ‌నే సినిమా తీసుకుని అందులో ఎమ్మెల్యే, సీఎం అవ్వచ్చు అని సెటైర్ వేశారు. 

ప‌వ‌న్ రాజ‌కీయ వ్య‌భిచారి అని.. ప్యాకేజీ స్టార్ అని ప్ర‌జ‌లంద‌రికి తెలుసన్నారు… తాను రెండు సార్లు కాకినాడ‌కు ఎమ్మెల్యేగా పని చేశాన‌ని.. ప‌వ‌న్ రెండు చోట్ల పొటీ చేసి ఓడిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఎవ‌రి కోసం ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీని పెట్ట‌రానేది అంద‌రికి తెలుస‌ని.. ప‌క్క‌వారిని విమ‌ర్శించే ముందు ఒక‌టికి, రెండు సార్లు ప‌రిశీలించుకోవాల‌న్నారు.

ఒంటరిగా వస్తావో కలిసి వస్తావో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జనసేన తరపున కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు. చెప్పాలంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇదే స‌రైన ఆవ‌కాశం.. ప్ర‌స్తుతం కాకినాడ టూర్‌లో ఉన్న ప‌వ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి ఛాలెంజ్ స్వీక‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తే జ‌న‌సేన మైలేజ్ పెరుగుతుందంటూన్నారు జ‌న‌సైనికులు. మ‌రి ప‌వ‌న్ ఛాలెంజ్ ఒప్పుకుంటారా లేదా అనేది ఈ రోజు రాత్రి స‌భ‌లో తెలియ‌వ‌చ్చు.