పార్టీ గుర్తే పోయింది చూసుకోవయ్యా పవనూ!

చెప్పులు ఒకటి పోతే మరోటి కొనుక్కోవచ్చు. కానీ నీ పార్టీ జనసేనకు ఎన్నికల సంఘం ఇచ్చిన గాజు గ్లాసు గుర్తు పోయింది అది నీకు తెలుసా పవనూ అంటూ మంత్రి సీదరి అప్పలరాజు గట్టిగానే…

చెప్పులు ఒకటి పోతే మరోటి కొనుక్కోవచ్చు. కానీ నీ పార్టీ జనసేనకు ఎన్నికల సంఘం ఇచ్చిన గాజు గ్లాసు గుర్తు పోయింది అది నీకు తెలుసా పవనూ అంటూ మంత్రి సీదరి అప్పలరాజు గట్టిగానే గుచ్చేశారు. చెప్పులు అంటూ ఎంతసేపూ మాట్లాడే పవన్ ముందు పార్టీ గుర్తు పోయింది అన్న దాని మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి అదెక్కడ ఉందో వెతికి దాన్ని ఎలా తెచ్చుకోవాలో పనిలో ఉండు అంటూ సలహా ఇచ్చారు.

ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి అని జనాలను అడుక్కుంటే రాదని, ప్రజలను మెప్పించాలని రాజకీయంగా సమర్ధత చాటాలని జనంలో ఉండాలని సీదరి అప్పలరాజు పవన్ కి హితబోధ చేశారు. ఈసారి అసెంబ్లీకి నేను వెళ్ళకుండా ఎలా అడ్డుకుంటారో చూస్తాను అంటూ పవన్ ఒక వైపు సవాల్ చేస్తున్నారని, ఇంతకీ ఆయనకు కావాల్సింది ఎమ్మెల్యేగానా లేక సీఎం సీటా అని మంత్రి డౌట్ వ్యక్తం చేశారు. తన పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం పవన్ వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.

తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో కూడా ఒక స్పష్టత లేని పవన్ కళ్యాణ్ సీఎం సీటుకే గురి పెట్టడం చూస్తూంటే రాజకీయ ఆరాటం తెలుస్తోందని మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. వారాహి యాత్రలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారని, తెర వెనక టీడీపీ జనసేన బీజేపీ అంతా ఒక్కటిగానే సంసారం చేస్తున్నారని సీదరి అప్పలరాజు అంటున్నారు. ఈ మూడు పార్టీలు 2024లో కూడా కలిసే పోటీకి దిగుతాయని ఆయన జోస్యం చెప్పారు.

చెప్పులు పోయాయని అంటున్న పవన్ కి గాజు గ్లాస్ గుర్తు పోయిన సంగతి తెలుసా అంటూ వైసీపీ నేతలు వరసబెట్టి కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కి గట్టిగానే వైసీపీ నుంచి జవాబులు వస్తున్నాయని అంటున్నారు.